సాక్షి, భాగ్యనగర్‌కాలనీ: యువతిని ప్రేమించి.. పెళ్లి చేసుకుంటానని శారీరకంగా అనుభవించి ఆ యువతి వద్ద పెద్ద మొత్తంలో నగదు తీసుకుని మోసం చేసిన ఘటనలో ఓ వ్యక్తిని కూకట్‌పల్లి పోలీసులు రిమాండ్‌కు తరలించారు. సీసిఐ నర్సింగ్‌రావు తెలిపిన వివరాలు.. మూసాపేటలోని ఆంజనేయనగర్‌లో నివాసముంటున్న ఒరిస్సా రాష్ట్రానికి చెందిన జాయ్ (32) విప్రో సంస్థలో టీమ్ లీడర్‌గా పనిచేస్తున్నాడు. అదే కంపెనీకి ఆల్వాల్‌కు చెందిన ప్రీతి (28) ఉద్యోగం కోసం వెళ్లింది. జాయ్ ఇంటర్వ్యూ అనంతరం ఆమెకు ఉద్యోగం ఇచ్చాడు. దీంతో వారిద్దరి మధ్య చనువు పెరిగింది. ఈ క్రమంలో వారిద్దరు ప్రేమించుకున్నారు. తాను పెళ్లి చేసుకుంటానని చెప్పి ఆమెను మూసాపేటలోని తన ఇంటికి రప్పించుకున్నాడు.
అనంతరం శారీరకంగా ఇద్దరూ కలిశారు. తాను బిజినెస్ చేస్తున్నానని, నీదగ్గర డబ్బు ఉంటే ఇయ్యాలని కోరగా ఆమె అతని మాటలు నమ్మిన దాచుకున్న 10 లక్షలు అతడికి అందజేసింది. ఇంకా డబ్బు అవసరముందని చెప్పడంతో మూడు బ్యాంకుల్లో రుణం తీసుకొని సుమారు రూ. 27 లక్షలు అందజేసింది. మొత్తం రూ. 37 లక్షలు అతడికి ఇచ్చింది. అయితే రుణం తీసుకున్న దగ్గర నుంచి బ్యాంకుల్లో వాయిదాలు చెల్లించాల్సి వచ్చంది. బ్యాంకు వారు వేధించటంతో ప్రీతి.. జాయ్‌ని నిలదీయగా అప్పటికే ఫోన్ స్విచాఫ్ చేసి ఆమెను దూరం పెట్టడమే కాకుండా పరారీలో ఉన్నాడు. తాను మోసపోయానని గ్రహించిన బాధితురాలు కూకట్‌పల్లి పోలీసులకు మార్చి 4న ఫిర్యాదు చేసింది.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు కోసం గాలించగా మహారాష్ట్ర నాసిక్‌లో ఉన్నట్లు తెలుసుకున్న అతడిని అదుపులోకి తీసుకొని విచారించగా ఇప్పటికే తాను వివాహం చేసుకున్నానని తన భార్య ఊరు వెళ్లిన సమయంలో ప్రీతిని తన ఇంటికి పిలిపించుకున్నానని అంగీకరించాడు. తాను ఆర్థికంగా నష్టపోవటంతో ఈ మోసానికి పాల్పడ్డానని తెలిపాడు. నిందితుడిని పోలీసులు శుక్రవారం రిమాండ్‌కు తరలించారు. అతని బ్యాంకులో ఉన్న రూ. 32 లక్షల నగదును సీజ్ చేయించినట్లు సీఐ నర్సింగరావు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment