Shamirpet: పిల్లల కోసం కాల్పులు.. ఇదొక హైప్రొఫైల్ ట్విస్టుల స్టోరీ | Twist In Shamirpet Villa Case: TV Actor Manoj Firing On Siddharth | Sakshi
Sakshi News home page

Shamirpet: పిల్లల కోసం కాల్పులు.. ఇదొక హైప్రొఫైల్ ట్విస్టుల స్టోరీ

Published Sat, Jul 15 2023 1:16 PM | Last Updated on Sat, Jul 15 2023 5:56 PM

Twist In Shamirpet Villa Case: TV Actor Manoj Firing On Siddharth  - Sakshi

సాక్షి, రంగారెడ్డి: శామీర్‌పేట కాల్పుల వ్యవహారంలో ట్విస్ట్‌ నెలకొంది. భర్త సిద్దార్థ్‌తో(42) విడిపోయిన స్మిత గ్రంథి.. మనోజ్‌తో సహజీవనం చేస్తున్నట్లు తెలిసింది. సిద్ధార్థ్‌, స్మితలకు ఒక కొడుకు కూతురు ఉండగా.. పిల్లలను తనకు అప్పగించాలని కొంతకాలంగా సిద్ధార్థ్‌ పోరాటం చేస్తున్నాడు. పిల్లలపై మనోజ్‌ దాడి చేశారంటూ గతంలో పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

మనోజ్‌పై స్మిత కొడుకు ఫిర్యాదు
మనోజ్‌పై స్మిత కొడుకు సైతం సంచలన ఆరోపణలు చేశాడు. మనోజ్‌ చిత్రహింసలు పెట్టాడని చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీకి ఫిర్యాదు చేశాడు. స్మిత కొడుకు కూకట్‌పల్లిలోని ఫిడ్జ్‌ కళాశాలలో 12వ తరగతి చదువుతుండగా, కుమార్తె శామీర్‌పేటలోని శాంతినికేతన్‌ రెడిసెన్షియల్‌ పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. ప్రస్తుతం పిల్లలిద్దరూ చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీ సంరక్షణలో ఉన్నారు.

పిల్లల కోసం రావడంతో
ఈ క్రమంలో తన పిల్లల కోసం సిద్ధార్థ్‌ విశాఖ నుంచి హైదరాబాద్‌ వచ్చాడు. శంషాబాద్‌లోని సెలబ్రిటీ క్లబ్‌లో ఉంటున్న స్మిత దగ్గకు వెళ్లాడు. ఈ క్రమంలో సిద్ధార్థ్‌ను చూసి  ఆగ్రహించిన మనోజ్‌.. ఎయిర్‌ గన్‌తో అతనిపై కాల్పులు జరిపాడు. మనోజ్‌ కాల్పుల నుంచి తప్పించుకున్న సిద్ధార్థ్‌..ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. బాధితుడు ఫిర్యాదుతో శామీర్‌పేట పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా మనోజ్‌ మౌన పోరాటం, కార్తీక దీపం వంటి పలు సీరియల్లో నటించాడు. 

సిద్ధార్థ్‌, స్మిత మధ్య విడాకుల కేసు
సిద్ధార్థ్‌ అతని భార్య స్మితకు 2019 నుంచి విభేదాలు ఏర్పడ్డాయని మేడ్చల్‌ డీసీపీ సందీప్‌ తెలిపారు. దీంతో సిద్ధార్థ్‌ నుంచి విడాకులు కావాలని అదే ఏడాది కూకట్‌పల్లి ఫ్యామిలీ కోర్టులో స్మిత విడాకులు ధరఖాస్తు చేసిందని పేర్కొన్నారు. సిద్ధార్థ్‌ వైజాగ్‌లో హిందూజా థర్మల్ పవర్‌లో మేనేజర్‌గా పనిచేస్తున్నాడని చెప్పారు. సిద్ధార్థ్‌తో విడిపోయిన తర్వాత స్మిత మనోజ్‌తో ఉంటుందని, గత మూడేళ్ళుగా సెలబ్రిటీ రిసార్ట్‌లోని విల్లాలో కలిసి ఉంటున్నారని చెప్పారు.  నేడు సిద్ధార్థ్‌ తన పిల్లలను చూడటానికి రిసార్ట్‌కు రాగా మనోజ్‌ ఎయిర్‌ గన్‌తో కాల్పులు జరిపాడని తెలిపారు.


చదవండి: పెళ్లైన 15 నెలలకే విషాదం.. గుండెపోటుతో లహరి మృతి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement