Man Injured In Firing At Shamirpet Celebrity Club - Sakshi
Sakshi News home page

శామీర్‌పేటలో కాల్పుల కలకలం..

Published Sat, Jul 15 2023 10:47 AM | Last Updated on Sat, Jul 15 2023 5:59 PM

Man Injured In Firing At Shamirpet Celebrity Club  - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : రంగారెడ్డి జిల్లా​ శామీర్‌పేట సెలబ్రిటీ క్లబ్‌లో కాల్పుల కలకలం చోటుచేసుకుంది. సిద్ధార్ధ్‌ దాస్‌ అనే వ్యక్తిపై మనోజ్‌ కుమార్‌ అనే వ్యక్తి కాల్పులు జరిపాడు. దీంతో సిద్దార్థ్‌కు గాయాలవ్వగా ఆసుపత్రికి తరలించారు. బాధితుడు ఫిర్యాదుతో శామీర్‌పేట పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.

అయితే వివాహేతర సంబంధం నేపథ్యంలో మనోజ్‌ ఈ కాల్పులకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. స్మిత, సిద్ధార్థ్ లకు గతంలో వివాహమయింది. వీరికి ఇద్దరు పిల్లలు. అయితే బేధాభిప్రాయాలతో ఇద్దరు విడివిడిగా ఉంటున్నారు. స్మిత ప్రస్తుతం మనోజ్ తో కలిసి శామీర్ పేటలో ఓ విల్లాలో ఉంటోంది. 

ఈ క్రమంలో తన పిల్లల కోసం సిద్ధార్థ్‌ విశాఖ నుంచి హైదరాబాద్‌ వచ్చాడు. శంషాబాద్‌లోని సెలబ్రిటీ క్లబ్‌లో ఉంటున్న స్మిత దగ్గకు వెళ్లాడు. ఈ క్రమంలో సిద్ధార్థ్‌ను చూసి  ఆగ్రహించిన  మనోజ్‌.. ఎయిర్‌ గన్‌తో అతనిపై కాల్పులు జరిపాడు. మనోజ్‌ కాల్పుల నుంచి తప్పించుకున్న సిద్ధార్థ్‌..ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. 

సిద్ధార్థ్‌ అతని భార్య స్మితకు 2019 నుంచి విభేదాలు ఏర్పడ్డాయని మేడ్చల్‌ డీసీపీ సందీప్‌ తెలిపారు. దీంతో సిద్ధార్థ్‌ నుంచి విడాకులు కావాలని అదే ఏడాది కూకట్‌పల్లి ఫ్యామిలీ కోర్టులో స్మిత విడాకులు ధరఖాస్తు చేసిందని పేర్కొన్నారు. సిద్ధార్థ్‌ వైజాగ్‌లో హిందూజా థర్మల్ పవర్‌లో మేనేజర్‌గా పనిచేస్తున్నాడని చెప్పారు. సిద్ధార్థ్‌తో విడిపోయిన తర్వాత స్మిత మనోజ్‌తో ఉంటుందని, గత మూడేళ్ళుగా సెలబ్రిటీ రిసార్ట్‌లోని విల్లాలో కలిసి ఉంటున్నారని చెప్పారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement