
వర్క్‌షాపులో పాల్గొన్న హెచ్‌ఆర్ లీడర్లకు సర్టిఫికెట్లు ప్రదానం చేస్తున్న గవర్నర్ తమిళిసై, నల్సార్ వైస్ చాన్స్‌లర్ బాలకృష్ణారెడ్డి
శామీర్‌పేట్: దేశ నిర్మాణంలో మానవ వనరుల పాత్ర కీలకమైందని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. శామీర్‌పేట్‌లోని నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయంలో నల్సార్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్(డీవోఎంఎస్), సొసైటీ ఫర్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్‌మెంట్ హైదరాబాద్(ఎస్‌హెచ్‌ఆర్‌డీ) సంయుక్తంగా లీగల్ ఆక్యూమెన్ ఫర్ హెచ్‌ఆర్ లీడర్స్ పేరుతో నిర్వహించిన సదస్సులో గవర్నర్ ప్రసంగించారు.
ఈ సందర్భంగా నిర్వహించిన వర్క్‌షాప్‌లో పాల్గొన్నవారికి సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. తమిళిసై మాట్లాడుతూ సమాజం మొత్తం ఆనందంగా ఉండాలంటే సానుకూల మనసు, ఆరోగ్యం అవసరమని అన్నారు. ప్రపంచానికి నిరంతర అభ్యాసం, అభివృద్ధి అవసరమని, అందుకు మానవ వనరులే ముఖ్యమని పేర్కొన్నారు. ఈ క్లిష్టమైన ప్రక్రియను సులభతరం చేయడంలో హెచ్‌ఆర్ లీడర్లు ముఖ్యపాత్ర పోషిస్తారని అన్నారు.
నల్సార్ వైస్ చాన్స్‌లర్, రిజిస్ట్రార్ బాలకృష్ణారెడ్డి మాట్లాడుతూ వర్క్‌షాప్‌లో 200 మంది హెచ్‌ఆర్ లీడర్లు పాల్గొన్నారని చెప్పారు. ఈ సందర్భంగా హెచ్‌ఆర్ లీడర్లు నిర్వహించే పని గురించి వివరించారు. కార్యక్రమంలో డిపార్ట్‌మెంట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్ అధిపతి విద్యాలతారెడ్డి, ఎస్‌హెచ్‌ఆర్‌డీ కో ఫౌండర్ రమేశ్ మంతన, హిందు మాధవి, హెచ్‌ఆర్ లీడర్స్, విద్యార్థులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment