శామీర్‌పేట (రంగారెడ్డి) : వడదెబ్బతో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా శామీర్ పేట మండలంలోని తుర్కపల్లిలో సోమవారం చోటు చేసుకుంది. బాధిత కుటుంబీకులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం... కానుగుల జ్ఞానేశ్వర్(50) అనే వ్యక్తి ఓ సెలూన్‌లో రోజు కూలీగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే ఎండ తీవ్రతకు వారం రోజుల కిందట అస్వస్థతకు గురయ్యాడు. కాగా పరిస్థితి విషమించి సోమవారం మృతి చెందాడు.