శామీర్‌పేట్ (రంగారెడ్డి) : వేగంగా వెళ్తున్న ఆర్టీసీ బస్సు రోడ్డు పై వెళ్తున్న గొర్రెలను ఢీకొట్టింది. దీంతో 40 గొర్రెలు మృతిచెందాయి. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా శామీర్‌పేట్ మండలం తుర్కపల్లి గ్రామ శివారులోని రాజీవ్ రహదారిపై శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. గజ్వేల్ నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు రోడ్డు పై వెళ్తున్న గొర్రెలను ఢీకొట్టడంతో.. 40 గొర్రెలు మృతిచెందాయి.