
సాక్షి,హైదరాబాద్ : సంక్రాంతి సందర్భంగా సొంతూళ్లకు వెళ్లే వారికోసం టీఎస్‌ఆర్టీసీ (TGSRTC) ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు 6432 ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయించింది. 557 సర్వీసులకు ముందస్తు రిజర్వేషన్ సౌకర్యం ఉండగా.. ఈ సంక్రాంతికి జిల్లాల నుంచి హైదరాబాద్‌కు ప్రత్యేకంగా ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి ఉంచనున్నట్లు వెల్లడించింది. జనవరి 9 నుంచి 15 వరకు సంక్రాంతి పండుగకు ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయని టీఎస్‌ఆర్టీసీ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment