రాష్ట్రంలో తలెత్తిన ఆర్థిక సంక్షోభం కారణంగా సీఎం, రాష్ట్ర మంత్రులు, ప్రధాన పార్లమెంటరీ కార్యదర్శులు (సీపీఎస్), క్యాబినెట్ స్థాయి సభ్యులందరూ రెండు నెలల పాటు జీతాలు తీసుకోరని గురువారం హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు తెలిపారు.
రానున్న రెండు నెలలపాటు జీతాలు, టీడీ, డీఏలు తీసుకోబోమని కేబినెట్‌లో చర్చించిన తర్వాత మంత్రివర్గంలోని సభ్యులంతా నిర్ణయించారు’ అని సుఖ్వీందర్ సింగ్ సుఖు చెప్పారు. ఈ విషయంలో ఎమ్మెల్యేలందరూ కూడా సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
కాగా, జూన్-ఆగస్ట్ నెలలో హిమాచల్ ప్రదేశ్‌లో పలు రాష్ట్రాల్లో వరదలు సంభవించాయి.100 మంది మృతి చెందారు. బ్రిడ్జ్‌లు, రోడ్లు, పలు నిర్మాణాలు దెబ్బతిన్నాయి. పర్యాటక రంగంపై ప్రతికూల ప్రభావం పడింది. ఈ తరుణంలో మధ్యప్రదేశ్ అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు రెండు నెలల పాటు తమ జీత భత్యాల్ని తీసుకోమని తీర్మానించారు.
Comments
Please login to add a commentAdd a comment