thanks to CM KCR
-
రైతు రుణమాఫీపై కేసీఆర్‌కు కృతజ్ఞతలు
సాక్షి, హైదరాబాద్: రైతు రుణమాఫీతోపాటు ఇటీవల కేబినెట్ తీసుకున్న పలు నిర్ణయాలపై కృతజ్ఞతలు తెలుపుతూ సీఎం కేసీఆర్‌ను పలువురు మంత్రులు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలిశారు. గురువారం శాసనసభకు వచ్చి న కేసీఆర్‌ను కలిసేందుకు సీఎం చాంబర్ వద్ద ఎమ్మెల్యేలు బారులు తీరడంతో సందడి నెలకొంది. రూ.19 వేల కోట్ల మేర రైతు రుణమాఫీ చేస్తూ, సీఎం చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారని ధన్యవాదాలు తెలిపారు.అలాగే హైదరాబాద్‌లో మెట్రోరైలు విస్తరణ, ప్రభుత్వంలో ఆర్టీసీ సిబ్బంది విలీనంతోపాటు నోటరీ ఆస్తుల క్రమబద్దికరణ వంటి నిర్ణయాలపట్ల కృతజ్ఞతలు తెలిపారు. కేసీఆర్‌ను రైతుబాంధవుడిగా పేర్కొంటూ రాష్ట్రవ్యాప్తంగా రైతుల కుటుంబాలు సంబురాలు చేసుకుంటున్నాయని పలువురు ఎమ్మెల్యేలు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. కేసీఆర్‌ను కలిసిన వారిలో మంత్రులు నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, మల్లారెడ్డి, జగదీశ్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, పువ్వాడ అజయ్, ఎర్రబెల్లి, సత్యవతి రాథోడ్, కొప్పుల, గంగుల, ఇంద్రకరణ్‌రెడ్డి, మహమూద్ అలీ, తలసాని, సబితా ఇంద్రారెడ్డి తదితరులు ఉన్నారు. ఉమ్మడి జిల్లాలవారీగా సంబంధిత జిల్లా మంత్రులతో కలిసి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేసీఆర్‌కు పుష్పగుచ్ఛాలు అందజేసి రైతు రుణమాఫీ చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ఆధ్వర్యంలో ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, కార్పొరేషన్ల చైర్మన్లు వేణుగోపాలాచారి, ఆంజనేయ గౌడ్ ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. కేసీఆర్, రైతన్నల మధ్య వాత్సల్యానికి అద్దంపట్టే క్యారికేచర్‌ను ఈ సందర్భంగా సీఎంకు అందజేశారు. -
మావి ఓట్ల రాజకీయాలు కాదు: సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: ‘‘తెలంగాణలోని ప్రతి వర్గం, కులం బాగుపడాలనేదే ప్రభుత్వ సంకల్పం. గత పాలకుల మాదిరిగానో, ఇతర రాజకీయ పార్టీల మాదిరిగానో మావి ఓట్ల రాజకీయాలు కాదు. ప్రజాసంక్షేమమే మా ధ్యేయం. మేం రెండోసారి అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే గొర్రెల పంపిణీ చేయాలని నిర్ణయించినం. అప్పుడు ఏ ఎన్నికలున్నయి?..’’ అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రశ్నించారు. తమది ఎన్నికల విధానం కాదని.. తెలంగాణ సకల జనులు సుఖంగా ఉండాలనేదే తమ విధానమని స్పష్టం చేశారు. తెలంగాణ రాకముందు పల్లెపల్లెనా పల్లేర్లు మొలిసే అని పాడుకున్నామని.. ఇప్పుడు పల్లెపల్లెనా పంట పొలాలు పచ్చగ మెరుస్తున్నాయని చెప్పారు. రూ.6 వేలకోట్లతో రెండో విడత గొర్రెల పంపిణీ, యూనిట్ ధర పెంపుపై తెలంగాణ రాష్ట్ర కురుమ సంఘం నేతలు బుధవారం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడారు. రాష్ట్రంలో సబ్బండ వర్ణాల అభ్యున్నతి కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని చెప్పారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా మరింత పట్టుదలతో ఈ అభివృద్ధి కొనసాగిస్తామని పేర్కొన్నారు. గొర్రెల పెంపకం కోసం గ్రామాల్లో షెడ్ల నిర్మించాలన్న ఆలోచన చేస్తున్నామని కేసీఆర్ తెలిపారు. యాదవులు, గొల్ల కురుమలకు ఇప్పaటికే ఆత్మ గౌరవ భవనాల నిర్మాణం చేపట్టామన్నారు. దేశంలోనే ఎక్కడా లేనివిధంగా పశువుల కోసం సంచార వైద్యశాలలను ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. గొర్రెల సంఖ్యలో ఇప్పుడు తెలంగాణ దేశంలోనే నంబర్ వన్ స్థానానికి చేరుకుందన్నారు. గొర్రెలిచ్చిన సీఎం కేసీఆరే.. ఇప్పటిదాకా తామిచ్చిన గొంగడి కప్పుకుని, గొర్రెపిల్లను పట్టుకుపోయిన పాలకులను చూశామే తప్ప.. తమకు గొర్రెపిల్లలు ఇచ్చిన పాలకుడు మాత్రం సీఎం కేసీఆరేనని తెలంగాణ రాష్ట్ర కురుమ సంఘం నేతలు కొనియాడారు. గొల్లకుర్మల అభివృద్ధి కోసం పాటుపడుతున్న సీఎం ఈ దేశంలోనే కేసీఆర్ ఒక్కరేనని పేర్కొన్నారు. సీఎంను కలిసినవారిలో సంఘం అధ్యక్షుడు, ఎమ్మెల్సీ ఎగ్గె మల్లేశం, ప్రధాన కార్యదర్శి బండారు నారాయణ, నాయకులు కె.నర్సింహ, అరుణ్ కుమార్, నగేశ్, ప్రకాశ్ తదితరులు ఉన్నారు. ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ను కలిసిన కురుమ సంఘం నేతలు -
కేసీఆర్‌కు పాదాభివందనం
కొత్త జిల్లా ఏర్పాటు నేపథ్యంలో డిప్యూటీ స్పీకర్ స్పందన మెదక్ సంబరాల్లో పాల్గొన్న పద్మాదేవేందర్‌రెడ్డి మెదక్: మెదక్ పట్టణ కేంద్రంగా ప్రత్యేక జిల్లాను ప్రకటించిన సీఎం కేసీఆర్‌కు పాదాభివందనం చేస్తున్నట్టు డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి ప్రకటించారు. ప్రత్యేక జిల్లాను ప్రకటిస్తూ ప్రభుత్వం ముసాయిదాను జారీ చేసిన నేపథ్యంలో సోమవారం మెదక్ పట్టణంలో భారీ ఎత్తున సంబరాలు జరుపుకొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... ఎన్నో యేళ్ల నాటి ఈ ప్రాంత ప్రజల ఆకాంక్ష కేసీఆర్ ఆశీస్సులతో తీరిందన్నారు. ప్రత్యేక జిల్లాను ప్రకటించిన తండ్రిలాంటి సీఎం కేసీఆర్‌కు జీవితాంతం రుణపడి ఉంటానని తెలిపారు. జిల్లా సాధన కోసం సహకరించిన మంత్రి హరీశ్‌రావు, నర్సాపూర్, అందోల్, దుబ్బాక ఎమ్మెల్యేలు మదన్‌రెడ్డి, బాబూమోహన్, సోలిపేట రామలింగారెడ్డిలకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.