కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
- కొత్త జిల్లా ఏర్పాటు నేపథ్యంలో డిప్యూటీ స్పీకర్ స్పందన
- మెదక్ సంబరాల్లో పాల్గొన్న పద్మాదేవేందర్‌రెడ్డి
మెదక్: మెదక్ పట్టణ కేంద్రంగా ప్రత్యేక జిల్లాను ప్రకటించిన సీఎం కేసీఆర్‌కు పాదాభివందనం చేస్తున్నట్టు డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి ప్రకటించారు. ప్రత్యేక జిల్లాను ప్రకటిస్తూ ప్రభుత్వం ముసాయిదాను జారీ చేసిన నేపథ్యంలో సోమవారం మెదక్ పట్టణంలో భారీ ఎత్తున సంబరాలు జరుపుకొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... ఎన్నో యేళ్ల నాటి ఈ ప్రాంత ప్రజల ఆకాంక్ష కేసీఆర్ ఆశీస్సులతో తీరిందన్నారు. ప్రత్యేక జిల్లాను ప్రకటించిన తండ్రిలాంటి సీఎం కేసీఆర్‌కు జీవితాంతం రుణపడి ఉంటానని తెలిపారు. జిల్లా సాధన కోసం సహకరించిన మంత్రి హరీశ్‌రావు, నర్సాపూర్, అందోల్, దుబ్బాక ఎమ్మెల్యేలు మదన్‌రెడ్డి, బాబూమోహన్, సోలిపేట రామలింగారెడ్డిలకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.