
లక్నో: గత మూడు రోజులుగా భారీ వర్షాలు ఉత్తరప్రదేశ్‌ను ముంచెత్తుతున్నాయి. వర్షం ధాటికి జనజీవనం అస్తవ్యస్తమవుతోంది. సుమారు 14 జిల్లాలలో ఉరుములు, మెరుపులతో కూడి కుండపోతగా కురిసిన వర్షాలకు 15 మంది చనిపోయారని అధికారులు తెలిపారు. అదే విధంగా 133 భవనాలు కూలిపోయినట్లు పేర్కొన్నారు. వాన బీభత్సంతో భారీగా ప్రాణ, ఆస్తి నష్టం సంభవించినట్లు వెల్లడించారు. కాగా లక్నోలో శనివారం నుంచి మరో ఐదు రోజుల పాటు ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, , జార్ఖండ్, నుంచి మధ్య మహారాష్ట్ర, గోవా ప్రాంతాలతో పాటు.. ఈశాన్య రాష్ట్రాలైన అరణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మిజొరాంలలో అధిక వర్షపాతం నమోదు కానున్నట్లు పేర్కొంది. ఇక మరోవైపు అసోంను వరదలు ముంచెత్తుతున్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment