అధికారుల నిర్లక్ష్యం వ్యాపారులకు కలిసొస్తోంది. స్వతహాగా వ్యాపారులు ట్రేడ్ లెసైన్స్ ఫీజును చెల్లిద్దామని ముందుకు రారు. అధికారులు కూడా గట్టిగా అడగరు. ఫలితంగా మున్సిపల్ ఆదాయానికి గండి పడుతోంది. ప్రతి మునిసిపాలిటీల్లో 70శాతం ఇళ్లుంటే 30శాతం దుకాణాలే ఉంటాయి. కానీ వ్యాపారాలకు సంబంధించిన లెసైన్సులు కొందరికే ఉన్నాయి. ఏటా దుకాణాలు పెరుగుతున్నా మున్సిపల్ ఆదాయం మాత్రం పెరగడం లేదు. ఉన్నవారు కూడా ఏళ్ల తరబడి నుంచి ఫీజు చెల్లించడానికి మొండికేస్తుండటంతో ట్రేడ్ లెసైన్సు రుసుము కోట్లల్లో పేరుకపోయింది.
గద్వాల మున్సిపల్ పరిధిలో..
గద్వాల ప్రధాన రహదారిపై లెక్కలేనన్ని దుకాణాలు వెలిశాయి. ఇక్కడ గతంలో ఉన్న దుకాణ దారులు మినహా కొత్తగా పెట్టుకున్న దుకాణదారులు లెసైన్సు ఫీజు చెల్లించడం లేదు. ఏటా రూ.10 లక్షలు ట్రేడ్ లెసైన్సు ఫీజు లక్ష్యానికి గాను, ఏటా మార్చి ముగింపులో కేవలం లక్షకు మించి వసూలు చేయడంలేదు. మున్సిపల్ రికార్డుల ప్రకారం 1200 మంది మాత్రమే ట్రేడ్ లెసైన్సు పొందినట్లు సమాచారం.
అనధికారికంగా సుమారు 3 వేల మందికి పైగా దుకాణ దారులు లెసైన్సు లేకుండా వ్యాపారులు కొనసాగిస్తున్నారు. వీరు కొన్నేళ్లుగా వ్యాపారాలు కొనసాగిస్తూ రూ.లక్షల్లో ఫీజు ఎగ్గొడుతున్నారు. అలాగే ఆస్తిపన్నులు సైతం పెద్ద మొత్తంలో పేరుకపోయాయి. ఎన్నికల నేపథ్యంలో పన్నుల వసూళ్లు మందగించాయి. ప్రస్తుత ఆస్తిపన్ను డిమాండ్ రూ.1.70 కోట్లుతో పాటు గత ఏడాది బకాయిలు సుమారు కోటి వరకు ఉన్నాయి. దుకాణాల అద్దెలు సుమారు రూ.10 లక్షలు, నీటి పన్ను బకాయిలు రూ.4 లక్షల వరకు పేరుకపోయి ఉన్నాయి.
వారు కట్టరు..వీరికి పట్టదు
Published Fri, Jun 6 2014 3:19 AM | Last Updated on Sat, Sep 2 2017 8:21 AM
Advertisement