
గుజరాత్ పోలీసులు తప్పుచేశారు
అహ్మదాబాద్: గుజరాత్ పోలీసులు తప్పిదానికి పాల్పడ్డారు. అసలు దోషులకు కాకుండా ఎన్నారైలకు నోటీసులు పంపించారు. మొత్తం ముగ్గురు వ్యక్తులకు నోటీసులు పంపించగా వారిలో ఇద్దరు ఎన్నారైలే ఉన్నారు. ఆగస్టు 25న అహ్మదాబాద్లో కృష్ణానగర్ పటేళ్ల ఆందోళన సందర్భంలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి.
అయితే, ఈ ఘటనకు సంబంధించి నిందితులను గుర్తించే క్రమంలో పొరబడిన పోలీసులు ఎన్నారైలకు కూడా నోటీసులు ఇచ్చారు. దీంతో వేరే గత్యంతరం లేక వారు స్టేషన్కు హాజరుకావాల్సి వచ్చింది. వారు చేసిన తప్పిదం వీరేంద్ర పటేల్ అనే వ్యక్తి పోలీసుల ముందుకు వచ్చి వివరణ ఇవ్వడం ద్వారా తెలిసింది. ఓబీసీల్లో రిజర్వేషన్ కల్పించాలని హార్దిక్ పటేల్ అనే యువకుడి ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఆందోళన జరిగిన విషయం తెలిసిందే.