స్నేహితులతో కలిసి ఈతకెళ్లిన ఓ విద్యార్థి ప్రమాదవశాత్తు బావిలో మునిగి మృతి చెందాడు.
వరంగల్: స్నేహితులతో కలిసి ఈతకెళ్లిన ఓ విద్యార్థి ప్రమాదవశాత్తు బావిలో మునిగి మృతి చెందాడు. ఈ సంఘటన వరంగల్ జిల్లా కరీమాబాద్‌లో సోమవారం జరిగింది. వివరాలు..తాళ్లపద్మావతి ఫార్మసీ కళాశాలలో పటేల్ కిషన్(22) ఫార్మా-డి చదువుతున్నాడు. కాగా, కాలేజీకి సమీపంలో ఉన్న బావిలో ఈత కొట్టేందుకు తోటి స్నేహితులతో కలిసి వెళ్లాడు. అయితే, ప్రమాదవశాత్తు బావిలో మునిగి మృతి చెందాడు. దీంతో తోటి స్నేహితులు పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని వెలికితీసి పోస్ట్‌మార్టంకు తరలించారు. కాగా, కిషన్, కరీంనగర్ జిల్లా వేములవాడకు చెందినవాడిగా పోలీసులు గుర్తించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
(కరీమాబాద్)