
ఆ వ్యాఖ్యలు కుట్రపూరితం: జైపాల్ రెడ్డి
హైదరాబాద్: భారత ప్రథమ ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూపై కేంద్ర మంత్రి రవిశంకర్‌ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు కుట్రపూరితమైనవని కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి అన్నారు. జాతి గర్వించదగ్గ దిగ్గజం సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ అని, ఆయన్ను పొగుడుతూ నెహ్రూను నిందించటం అన్యాయమని తెలిపారు. ఇదంతా ఆర్‌ఎస్‌ఎస్ చేస్తున్న కుట్రేనని దుయ్యబట్టారు. ఆర్‌ఎస్‌ఎస్ అంటే రూమర్‌స్ప్రెడింగ్ సొసైటీ అని ఎద్దేవా చేశారు. క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో ఆర్‌ఎస్‌ఎస్ వాళ్లు బ్రిటిష్ వారికి తొత్తులుగా వ్యవహరించారని విమర్శించారు.
నెహ్రూ, పటేల్ ఇద్దరూ కలసి దాదాపు పదేళ్లు జైలు జీవితం గడిపినా ఇద్దరి మధ్యా ఏనాడూ అభిప్రాయ భేదాలు తలెత్తలేదని తెలిపారు. వారిద్దరూ కాంగ్రెస్ పార్టీకి రెండు కళ్లలాంటి వారని అభివర్ణించారు. కాశ్మీర్ విషయంలో బీజేపీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకున్నా కాంగ్రెస్ పార్టీ మద్దతునిస్తుందని జైపాల్‌రెడ్డి వివరించారు.