ఇంతకీ కాబోయే ఆర్బీఐ గవర్నర్ ఎవరు?
న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ పదవికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎవరిని ఎంపిక చేయనున్నారనే దానిపై భారీ అంచనాలు కొనసాగుతూనే ఉన్నాయి. అటు గతంలో కేంద్ర ప్రభుత్వం ముగ్గురు ప్రముఖుల పేర్లను షార్ట్ లిస్ట్ చేసినప్పటికీ ఈ ఉత్కంఠకు తెరపడలేదు. ఈ పదవికోసం పనాగరియా ఎంపిక దాదాపు ఖాయం అన్న వార్తలు ఇటీవల ప్రముఖంగా వినిపించాయి. కానీ ప్రభుత్వం నుంచి స్పష్టత రాలేదు. ప్రస్తుత ఆర్బీఐ రఘురామ్ రాజన్ స్థానంలో ఎంపికయ్యే అవకాశాలున్నవారిలో ఇద్దరి పేర్లు మరోసారి ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఈ రేస్ లో టాప్ ప్లేస్ లో దేశ ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్, ఆర్బిఐ డిప్యూటీ గవర్నర్ ఊర్జిత్ పటేల్ పేర్లు ఉన్నాయి. త్వరలోనే ప్రధాని నరేంద్ర మోదీ తుది నిర్ణయం తీసుకోనున్నారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
అరవింద్ సుబ్రహ్మణియన్ అహ్మదాబాద్ ఐఐఎం పూర్వ విద్యార్ధి. పీటర్సన్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఇంటర్నేషనల్ ఎకనామిక్స్ కోసం సీనియర్ ఫెలో గా ఉన్నారు. అలాగే అంతర్జాతీయ ద్రవ్య నిధి ఆర్థికవేత్తగా, గ్లోబల్ డెవలప్మెంట్ సెంటర్ కు సీనియర్ ఫెలోగా పనిచేశారు.
మరోవైపు, ఊర్జిత్ పటేల్ ఐఐఎం అహ్మదాబాద్ పూర్వ విద్యార్థి అయిన 'ఫ్లెక్సిబుల్ ఇన్ ఫ్లేషన్ టార్గెటింగ్' కమిటీకి నాయకత్వం వహిస్తున్నారు. అంతర్జాతీయ ద్రవ్య నిధి ఆర్థికవేత్తగా బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ కి పవర్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో మాజీ సలహాదారుగా పనిచేసిన అనుభవం ఉంది. అమెరికాలోని యేల్ విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్ డీ చేశారు. అంతర్జాతీయ ద్రవ్య నిధికి కూడా
కాగా ఇంతకుముందు, ఎస్బీఐ ఛైర్ పర్సన్ అరుంధతి భట్టాచార్య , ఆర్థిక సలహదారు శక్తికాంత్ దాస్ పేర్లు ఈ జాబితాలో ప్రముఖంగా వినిపించాయ. కేంద్ర బ్యాంకు గవర్నర్ రఘురామ రాజన్ పదవీకాలం ఈ సెప్టెంబర్ 4 న ముగియనుంది. మరో టర్మ్ గవర్నర్‌గా కొనసాగదలుచుకోలేదని స్వయంగా ఆయనే ప్రకటించారు. ప్రభుత్వంతో చర్చించాకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు రాజన్ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఆర్థిక మంత్రిత్వ శాఖలో ప్రధాన ఆర్థిక సలహాదారుగా విధులు నిర్వర్తిస్తున్న అరవింద్ సుబ్రమణియన్, ఆర్బీఐ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించే అవకాశాలున్నాయని విదేశీ మీడియా ఇటీవల పేర్కొనడం విశేషం.