
గుజరాత్ పదహారేళ్ల నీలాంశీ పటేల్ 5 అడుగల 7 అంగుళాల జుట్టుతో 2018 గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సాధించింది. పశ్చిమ బెంగాల్ మిసెస్ ఎన్.సి.సేన్‌గా మాత్రమే వందేళ్ల క్రితం నాటి పాత రికార్డులలో ఉన్న మృణాళినీ దేవి భారతదేశంలో విమాన ప్రయాణం చేసిన తొలి మహిళగా ‘టైమ్స్’ పత్రిక చేసిన పరిశోధనలో నిర్థారణ అయింది. న్యూఢిల్లీ కొత్త విషయాలను కనిపెట్టిన మహిళల పేటెంట్ దరఖాస్తులను సత్వరం పరిశీలించి వారిని ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
బ్రిటన్ ప్రధాని థెరిస్సా మే ఈ ఏడాది కేబినెట్‌లో క్రిస్మస్ వేడుకల సమయాన్ని కుదించి, మిగతా సమయాన్ని పాలనా వ్యవహారాలకు కేటాయించారు. పుస్తకం నటి మనీషా కొయిరాలా రాసిన ‘హౌ క్యాన్సర్ గేవ్ మి ఎ లైఫ్’ పుస్తకం ఈ నెల 28న మార్కెట్‌లోకి విడుదల అవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment