longest hair
-
ఎంత పెద్ద జుట్టో..! గిన్నీస్ రికార్డ్ కైవసం
లక్నో: కురులు ఆడవారికి మరింత అందాన్ని తీసుకొస్తాయి. అందుకే పొడవాటి కేశాల కోసం ప్రయత్నిస్తుంటారు. కానీ ఎలాంటి ప్రయత్నం చేయకుండానే యూపీలో ఓ మహిళ ఏకంగా 7 పీట్ల 9 ఇంచుల పొడవైన జుట్టును కలిగి ఉంది. ఇంతటి భారీ కేశాలతో ఏకంగా గిన్నీస్ రికార్డ్‌ను సాధించింది. స్మితా శ్రీవాస్తవ(46) ఉత్తరప్రదేశ్‌కు చెందిన మహిళ. ఆమె తన 14వ ఏట నుంచి జుట్టును కత్తిరించలేదు. అప్పటి నుంచి ఆమె జుట్టు క్రమంగా పెరగసాగింది. ప్రస్తుతం ఆమె జుట్టు 7 పీట్ల 9 ఇంచుల పొడవు ఉంది. ఇంతటి స్థాయిలో కేశాలను కలిగి ఉండటంతో ప్రపంచ రికార్డ్‌ను కైవసం చేసుకుంది. "భారతీయ సంస్కృతిలో దేవతలకు చాలా పొడవాటి జుట్టు ఉంటుంది. మన సమాజంలో జుట్టు కత్తిరించడం అశుభం అని భావిస్తారు. అందుకే మహిళలు జుట్టును పెంచుకునేవారు. పొడవాటి జుట్టు మహిళల అందాన్ని పెంచుతుంది." అని స్మిత వివరించారు. ఈ జుట్టుకు తాను ప్రతి వారం రెండు సార్లు శుభ్రం చేస్తానని స్మిత చెప్పారు. జుట్టును శుభ్రం చేసిన ప్రతిసారి దాదాపు మూడు గంటల సమయం పడుతుందని పేర్కొన్నారు. తన పొడవాటి జుట్టును చూసి చాలా మంది సెల్ఫీ తీసుకుంటారని చెబుతోంది. ప్రస్తుతం గిన్నీస్ రికార్డ్ సాధించడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తోంది. ఇదీ చదవండి: యూపీ అబ్బాయి.. డచ్ అమ్మాయి.. ఖండాంతరాలు దాటిన ప్రేమ -
110 అడుగుల జుట్టు
ఫొటో చూశారా? ఆమె ముందు పరిచి ఉన్న జుట్టు పొడవెంతో తెలుసా... 110 అడుగులు. అత్యంత పొడవైన డ్రెడ్‌లాక్స్ (చిక్కులు పడిన జుట్టు) కలిగిన మహిళగా గిన్నిస్ వరల్డ్ రికార్డును సొంతం చేసుకుంది ఫ్లోరిడాకు చెందిన ఆశా మండేలా. 40 ఏళ్లుగా ఈ జుట్టు పెంచుతున్న ఆమె... 19 అడుగుల ఆరున్నర అంగుళాల పొడవు డ్రెడ్‌లాక్స్ ఉన్న మహిళగా 2009 నవంబర్ 11లోనే గిన్నిస్ రికార్డు సాధించింది. 14 ఏళ్ల తరువాత 110 అడుగుల పొడవైన జుట్టుతో తన రికార్డును తానే బ్రేక్ చేసుకుంది. ఆధ్యాత్మిక శోధనలో భాగంగానే ఈ జుట్టు పెంచానని, అది తన జీవితాన్నే మార్చేసిందంటుంది ఆశా మండేలా. ఆ ముడులను డ్రెడ్గా పిలవడానికి ఇష్టపడదు.. అది తన కిరీటమని చెబుతుంది. అంత పొడవైన జుట్టు.. మెయింటెనెన్స్ కష్టం కదా! అంటే? కిందపడకుండా సిల్క్ క్లాత్‌లో చుట్టేసుకుంటుంది. ఆ హెయిర్‌ను ఒక్కసారి వాష్ చేయాలంటే ఆరు షాంపూ బాటిల్స్ అయిపోతాయి. ఇక ఆరడానికి పట్టే సమయం రెండు రోజులు! -
స్త్రీలోక సంచారం
గుజరాత్ పదహారేళ్ల నీలాంశీ పటేల్ 5 అడుగల 7 అంగుళాల జుట్టుతో 2018 గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సాధించింది. పశ్చిమ బెంగాల్ మిసెస్ ఎన్.సి.సేన్‌గా మాత్రమే వందేళ్ల క్రితం నాటి పాత రికార్డులలో ఉన్న మృణాళినీ దేవి భారతదేశంలో విమాన ప్రయాణం చేసిన తొలి మహిళగా ‘టైమ్స్’ పత్రిక చేసిన పరిశోధనలో నిర్థారణ అయింది. న్యూఢిల్లీ కొత్త విషయాలను కనిపెట్టిన మహిళల పేటెంట్ దరఖాస్తులను సత్వరం పరిశీలించి వారిని ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. బ్రిటన్ ప్రధాని థెరిస్సా మే ఈ ఏడాది కేబినెట్లో క్రిస్మస్ వేడుకల సమయాన్ని కుదించి, మిగతా సమయాన్ని పాలనా వ్యవహారాలకు కేటాయించారు. పుస్తకం నటి మనీషా కొయిరాలా రాసిన ‘హౌ క్యాన్సర్ గేవ్ మి ఎ లైఫ్’ పుస్తకం ఈ నెల 28న మార్కెట్లోకి విడుదల అవుతోంది. -
జుట్టుతో గిన్నిస్ రికార్డుకెక్కుతా!!
చిన్నప్పటి నుంచి ఆమెకు జుట్టంటే అమితమైన ప్రేమ. అలా పెంచుతూనే ఉంది. అందుకే ఇప్పుడు ఆ జుట్టుతోనే గిన్నిస్ రికార్డు సాధిస్తానని చెబుతోంది. ఇంతకీ ఉత్తరప్రదేశ్‌లోని బాఘ్‌పత్ ప్రాంతానికి చెందిన ప్రియాంక జుట్టు పొడవెంతో తెలుసా.. ఆమె పొడవు కంటే ఎక్కువ.. అక్షరాలా 6 అడుగులు!! జీవితంలో ఏనాడూ షాంపూలు గానీ, ఇతర రసాయన పదార్థాలు గానీ ఉపయోగించలేదని, కేవలం హెర్బల్ ఉత్పత్తులను మాత్రమే ఉపయోగించడం వల్లే తన జుట్టు ఇంత బలంగా, పొడవుగా ఉందని ఆమె తెలిపింది. తాను చిన్నపిల్లగా ఉన్నప్పటి నుంచి కూడా జుట్టంటే మహా ఇష్టమని ఆమె మీడియాకు చెప్పింది.