మైసూరు : సుపారీ (కిరాయి) తీసుకుని వ్యాపార వేత్తను హత్య చెయ్యడానికి యత్నించిన మహిళ సహ 8 మందిని మైసూరులోని ఉదయగిరి పోలీసులు అరెస్టు చేశారు. మైసూరులోని శక్తినగరలో నివాసం ఉంటున్న భాగ్య (30) అనేయువతితో పాటు రవికుమార్, శశికుమార్, శాంతకుమార్, మధు, సతీష్, దర్శన్, అక్షయ్‌కుమార్‌లను అరెస్టు చేసి రెండు కార్లు, మారణాయుధాలు స్వాధీనం చేసుకున్నామని బుధవారం పోలీసులు చెప్పారు.
నిందితులను పోలీసులు రిమాండ్‌కు తరలించారు. వివరాలు... మైసూరు తాలుకా మల్లహళ్లిలో ఉంటున్న శ్రీనివాస్ మద్యం వ్యాపారి. దేవరాజ్ అనే వ్యాపారికి కొన్నినెలల క్రితం వైన్‌షాప్, లెసైన్స్ రూ. 70 లక్షలకు విక్రయించాడు. అడ్వాన్స్‌గా రూ. 20 లక్షలు శ్రీనివాస్‌కు ఇచ్చారు. మిగిలిన రూ. 50 లక్షలు ఇవ్వకుండ దేవరాజ్ వేధిస్తున్నాడని సమాచారం. ఈ విషయంలో విసిగిపోయిన శ్రీనివాస్, శక్తి నగరలో నివాసం ఉంటున్న భాగ్యను కలిశాడు. దేవరాజ్‌ను హతమార్చడానికి కిరాయి కుదుర్చుకున్నారు. సోమవారం వేకువ జామున రెండు కార్లలో ఎనిమిది మంది దేవరాజ్‌ను హత్య చేయడానికి వేచి ఉన్నారు.
ఆ సమయంలో గస్తీ పోలీసులు వీరిని పట్టుకున్నారు. వారి వద్ద ఉన్న వేడకొడవళ్లు, కర్రలు, కారంపొడి స్వాధీనం చేసుకుని అందరి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అనంతరం విచారణ చేయడంతో అసలు విషయం బయట పెట్టారు. హత్య చెయ్యడానికి కిరాయి ఇచ్చిన శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నామని బుధవారం ఉదయగిరి పోలీసులు తెలిపారు.
వ్యాపారవేత్త హత్యకు కుట్ర
Published Thu, Sep 25 2014 3:37 AM | Last Updated on Mon, Jul 30 2018 8:29 PM
Advertisement