సాక్షి, బెంగళూరు: కొద్దిరోజులక్రితం కర్ణాటక బెంగళూరులో 44 ఏళ్ల వ్యాపారవేత్త దారుణహత్యకు గురయ్యాడు. అతని సన్నిహితుడే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. అయితే ఆర్థిక తగాదాలే ఈ హత్యకు కారణమై ఉంటాయని పోలీసులు తొలుత అనుమానించారు. కానీ విచారణలో వెలుగుచూసిన అసలు విషయం తెలిసి షాక్ అయ్యారు.
హత్యకు గురైన వ్యాపారవేత్త పేరు లియాకాత్ అలీ ఖాన్. ఓ అడ్వర్‌టైజింగ్ ఏజెన్సీ నడుపుతున్నాడు. నిందితుడి పేరు ఇల్యాజ్ ఖాన్(26). ఇతని దగ్గరే చాలా ఏళ్లుగా పనిచేస్తున్నాడు. అయితే ఇద్దరు స్వలింగసంపర్కులు. కరోనా లాక్‌డౌన్‌లో వీరి మధ్య రిలేషన్ ఏర్పడింది. అప్పటి నుంచి రెండేళ్లుగా దీన్ని కొనసాగిస్తున్నారు.
ఫిబ్రవరి 28న కూడా మైసూరు రోడ్డులోని నయందహల్లిలో పాత భవనంలో రాత్రి ఇద్దరూ కలిశారు. అనంతరం తనకు అమ్మాయితో పెళ్లి కుదిరిందని, ఇకపై రిలేషన్ కొనసాగించలేనని ఇల్యాజ్ చెప్పాడు. దీనికి లియాకాత్ ఒప్పుకోలేదు. రిలేషన్ కొనసాగించాల్సిందేనని పట్టుబట్టాడు. ఈక్రమంలోనే ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఆవేశంలో లియాకాత్‌ను ఇల్యాజ్ తలపై సుత్తితో బాదాడు. ఆపై కత్తెర్లతో అతడ్ని పొడిచాడు. తీవ్రగాయాలపాలైన లియాకాత్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
లియాకాత్ కుమారుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మొదట ఈ హత్యలో ముగ్గురి ప్రమేయం ఉండవచ్చని అనుమానించారు. కానీ ఇల్యాజ్‌ను విచారించగా అసలు విషయం తెలిసింది. అతనొక్కడే ఈ హత్య చేసినట్లు అంగీకరించాడు. కాగా.. లియాకాత్ అలీకి ఓ మహిళతో పెళ్లైంది. ఆమెకు అప్పటికే ఇద్దరు పిల్లలు ఉన్నట్లు తెలుస్తోంది.
చదవండి: ఢిల్లీ లిక్కర్ స్కాం.. అరుణ్ రామచంద్ర పిళ్లై ఈడీ రిపోర్టులో మరోసారి కవిత పేరు
Comments
Please login to add a commentAdd a comment