Fortunes
-
Tamil Nadu: బీజేపీ బలోపేతానికి ‘పంబన్’ వారధి?
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ నేడు (ఆదివారం) తమిళనాడు ప్రజలకు పంబన్ బ్రిడ్జి(Pamban Bridge) రూపంలో భారీ కానుకను అందించనున్నారు. శ్రీరామనవమి సందర్భంగా ప్రధాని మోదీ ఈ అద్భుత వంతెనను జాతికి అంకితం చేయనున్నారు. ఈ నేపధ్యంలో బీజేపీ దక్షిణ భారతదేశంలో తన పట్టును బలోపేతం చేసుకునేందుకే ఈ వంతెనను వ్యూహాత్మకంగా ప్రారంభిస్తున్నదనే వాదన వినిపిస్తోంది. 2.08 కిలోమీటర్ల పొడవైన ఈ నూతన పంబన్ వంతెన రామేశ్వరాన్ని భారత ప్రధాన భూభాగంతో అనుసంధానం చేస్తుంది.పంబన్ బ్రిడ్జి భారతదేశంలోని మొట్టమొదటి సముద్రపు వంతెన. ఓడల రాకపోకలకు అనుగుణంగా ఈ బ్రిడ్జి గేట్లు తెరుచుకుంటాయి. నూతనంగా నిర్మించిన ఈ వంతెన మరింత ధృడంగా ఉండనుంది. ఇది తమిళనాడు(Tamil Nadu) ప్రజలకు రవాణా సౌకర్యాన్ని మరింత సులభతరం చేయనుంది. అలాగే పర్యాటకరంగానికి ప్రోత్సాహాన్ని అందించనుంది. హిందువులు ఎంతో పవిత్రంగా భావించే రామేశ్వరంనకు రాకపోకలు సాగించేందుకు ఈ వంతన ఉపయోగపడనుంది. శ్రీరాముని జన్మదినోత్సవమైన రామ నవమిని దక్షిణ భారతదేశంలో ఎంతో వైభవంగా జరుపుకుంటారు. ఈ సందర్భంగా రామేశ్వరంనకు వేలాదిమంది భక్తులు తరలివస్తారు.రామాయణంలోని వివరాల ప్రకారం శ్రీరాముడు లంకను చేరుకునేందుకు ఇక్కడ స్వయంగా వారధి నిర్మించారని చెబుతారు. అందుకే ఈ ప్రాంతానికి ఎంతో ప్రాధాన్యత ఏర్పడింది. కాగా తమిళనాడు ప్రజలలో తన హిందూత్వ ఎజెండాను బలంగా ముందుకు తీసుకువెళ్లేందుకు బీజేపీ పంబన్ బ్రిడ్జిని అద్భుతంగా నిర్మించి, జాతికి అంకితం చేస్తున్నదని పలువురు ఆరోపిస్తున్నారు. 2026లో తమిళనాడులో ఎన్నికల జరగనున్న దృష్ట్యా బీజేపీ ఈ రాష్ట్రంపై ప్రత్యేక దృష్టి సారించింది. 234 మంది సభ్యులు కలిగిన తమిళనాడు శాసనసభకు జరిగే ఎన్నికల్లో తన బలాన్ని నిరూపించుకోవాలని బీజేపీ ఇప్పటి నుంచే ప్రయత్నాలు ప్రారంభించింది.తమిళనాడు రాజకీయాలలో(Tamil Nadu politics) డీఎంకే, ఏఐఏడీఎంకేల ఆధిపత్యం కొనసాగుతోంది. ఉత్తర భారతదేశంలో బలమైన పట్టు ఉన్న బీజేపీ, దక్షిణాదిలో ఇంకా గణనీయమైన ప్రభావాన్ని చూపలేకపోతోంది. అయితే పంబన్ బ్రిడ్జి వంటి పెద్ద ప్రాజెక్టులను చేపట్టి, తద్వారా తమిళనాడు అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని బీజేపీ తమిళనాడు ప్రజలకు తెలియజెప్పాలనుకుంటోంది. తమిళనాడులో రెండవ అతిపెద్ద పార్టీ అయిన అన్నాడీఎంకే గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుంది. అయితే ఆ కూటమి ఎన్నికల్లో విఫలం కావడంతో, బీజేపీకి ఏఐడిఎంకే దూరమయ్యింది. ఇప్పుడు 2026 ఎన్నికలకు ముందు బీజేపీ మరోసారి అన్నాడీఎంకేతో చేతులు కలపడానికి ప్రయత్నిస్తోందని భోగట్టా. అయితే బీజేపీ వ్యూహం ఎంతవరకూ ఫలిస్తుందో కాలమే చెబుతుంది. ఇది కూడా చదవండి: చెలరేగిపోతున్న యూట్యూబర్లు.. కేదార్‌నాథ్‌లో కొత్త రూల్ -
వ్యాపారవేత్త హత్యకు కుట్ర
మైసూరు : సుపారీ (కిరాయి) తీసుకుని వ్యాపార వేత్తను హత్య చెయ్యడానికి యత్నించిన మహిళ సహ 8 మందిని మైసూరులోని ఉదయగిరి పోలీసులు అరెస్టు చేశారు. మైసూరులోని శక్తినగరలో నివాసం ఉంటున్న భాగ్య (30) అనేయువతితో పాటు రవికుమార్, శశికుమార్, శాంతకుమార్, మధు, సతీష్, దర్శన్, అక్షయ్‌కుమార్‌లను అరెస్టు చేసి రెండు కార్లు, మారణాయుధాలు స్వాధీనం చేసుకున్నామని బుధవారం పోలీసులు చెప్పారు. నిందితులను పోలీసులు రిమాండ్‌కు తరలించారు. వివరాలు... మైసూరు తాలుకా మల్లహళ్లిలో ఉంటున్న శ్రీనివాస్ మద్యం వ్యాపారి. దేవరాజ్ అనే వ్యాపారికి కొన్నినెలల క్రితం వైన్‌షాప్, లెసైన్స్ రూ. 70 లక్షలకు విక్రయించాడు. అడ్వాన్స్‌గా రూ. 20 లక్షలు శ్రీనివాస్‌కు ఇచ్చారు. మిగిలిన రూ. 50 లక్షలు ఇవ్వకుండ దేవరాజ్ వేధిస్తున్నాడని సమాచారం. ఈ విషయంలో విసిగిపోయిన శ్రీనివాస్, శక్తి నగరలో నివాసం ఉంటున్న భాగ్యను కలిశాడు. దేవరాజ్‌ను హతమార్చడానికి కిరాయి కుదుర్చుకున్నారు. సోమవారం వేకువ జామున రెండు కార్లలో ఎనిమిది మంది దేవరాజ్‌ను హత్య చేయడానికి వేచి ఉన్నారు. ఆ సమయంలో గస్తీ పోలీసులు వీరిని పట్టుకున్నారు. వారి వద్ద ఉన్న వేడకొడవళ్లు, కర్రలు, కారంపొడి స్వాధీనం చేసుకుని అందరి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అనంతరం విచారణ చేయడంతో అసలు విషయం బయట పెట్టారు. హత్య చెయ్యడానికి కిరాయి ఇచ్చిన శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నామని బుధవారం ఉదయగిరి పోలీసులు తెలిపారు. -
‘అన్న భాగ్య’ విస్తరణ
సాక్షి, బెంగళూరు : రాష్ర్టంలో రూపాయి కిలో బియ్యం పథకం ‘అన్న భాగ్య’ కింద రాగులు, జొన్నలు, గోధుమలను కూడా పంపిణీ చేయాలని రాష్ట్ర మంత్రి వర్గం తీర్మానించింది. అక్టోబరు నుంచి చౌక దుకాణాల్లో వీటి పంపిణీ ప్రారంభమవుతుంది. రాగులు, జొన్నలు, గోధుమలు వద్దనుకున్న వారు బియ్యం తీసుకోవచ్చు. విధాన సౌధలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అధ్యక్షతన జరిగిన మంత్రి వర్గ సమావేశం జరిగింది. అనంతరం న్యాయశాఖ మంత్రి టీబీ. జయచంద్ర సమావేశం వివరాలను విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఉత్తర కర్ణాటకలో అన్న భాగ్య కింద 10 కిలోల బియ్యం పొందుతున్న వారు ఇకపై నాలుగు కిలోల బియ్యం, రెండు కిలోల గోధుమ, నాలుగు కిలోల జొన్నలను తీసుకోవచ్చు. ఇరవై కిలోల బియ్యం తీసుకుంటున్న వారు 11 కిలోల బియ్యం, మూడు కిలోల గోధుమలు, ఆరు కిలోల జొన్నలను పొందవచ్చు. 30 కిలోల బియ్యం బదులుఐదు కిలోల గోధుమలు, ఎనిమిది కిలోల జొన్నలు, 15 కిలోల బియ్యం తీసుకోవచ్చు. దక్షిణ కర్ణాటకకు చెందిన వారికి జొన్నల స్థానంలో రాగులను అందిస్తారు. 10 కిలోల బియ్యం పొందే కుటుంబాలు కిలో గోధుమలు, రెండు కిలోల రాగులు, ఏడు కిలోల బియ్యం పొందవచ్చు. 20 కిలోల బియ్యం బదులు రెండు కిలోల గోధుమలు, మూడు కిలోల రాగులు, 15 కిలోల బియ్యం తీసుకోవచ్చు. 30 కిలోల బియ్యం బదులు మూడు కిలోల గోధుమలు, అయిదు కిలోల రాగులు, 22 కిలోల బియ్యం పొందవచ్చు. ఇతర నిర్ణయాలు = గత బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన గోవధ నిషేధ ముసాయిదా బిల్లుల ఉపసంహరణ = బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో యూజర్ చార్జీల పెంపునకు అనుమతి = కోలారు వద్ద రైల్వే బోగీల తయారీ కర్మాగారం కోసం రాష్ట్ర వాటాగా రూ.100 కోట్ల విడుదలకు అంగీకారం. ప్రైవేట్ భూ సేకరణకు ఆదేశాలు.