భార్య ముందే వేరే యువతులతో భర్త అశ్లీల పనులు..  | Wife Uma Arrested in businessman Santosh Padmanna murder case | Sakshi
Sakshi News home page

భార్య ముందే వేరే యువతులతో భర్త అశ్లీల పనులు.. 

Published Mon, Oct 21 2024 8:27 AM | Last Updated on Mon, Oct 21 2024 10:39 AM

Wife Uma Arrested in businessman Santosh Padmanna murder case

ఇంట్లోనే భర్త అశ్లీల పనులు.. 

మిత్రులతో కలిసి హత్య చేయించిన భార్య

బెళగావిలో కిరాతకం గుట్టురట్టు

రాయచూరు రూరల్‌: ఏడడుగులు నడిచి అగ్ని సాక్షిగా చేసుకున్న వైవాహిక బంధం కొందరి వల్ల నవ్వుల పాలవుతోంది. దంపతుల్లో ఎవరో ఒకరు పర వ్యామోహానికి గురై కాపురంలో చిచ్చు పెట్టుకుంటున్నారు. ఆపై చట్టానికి చిక్కి ఊచలు లెక్కించే ఘటనలు ఎక్కడో ఒకచోట బయటపడుతున్నాయి. బెళగావి నగరంలోనూ అదే జరిగింది.

చంపి, కళ్లను దానం చేసి
వివరాలు.. ఈ నెల 9వ తేదీన బెళగావి మహంతేష్‌ నగరలో నివాసమున్న పారిశ్రామికవేత్త సంతోష్‌ పద్మణ్ణవర్‌ (47) గుండెపోటుతో చనిపోయాడని ఆయన భార్య ఉమ పద్మణ్ణవర్‌ అందరికీ చెప్పి అంత్యక్రియలు జరిపించింది. పైగా భర్త కళ్లను దానం చేసింది. బెంగళూరులో చదువుకుంటున్న వారి కుమార్తె సంజన ఇంటికి వచ్చాక ఏదో జరిగిందని గ్రహించి 3 రోజుల కిందట స్థానిక మాళమారుతి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు లోతుగా దర్యాప్తు చేయగా నివ్వెరపరిచే సంగతులు వెలుగు చూశాయి. సంతోష్‌ నిరంతరం యువతులను ఇంటికి తెచ్చుకుని వారితో గడిపేవాడు. ఇంట్లో భార్య ముందే వారితో నగ్నంగా సంచరించేవాడు. ఇంటి సీసీ కెమెరాల 13 హార్డ్‌ డిస్కులను, రికార్డర్లను తనిఖీ చేయగా అవే దృశ్యాలు కనిపించడంతో కంగుతిన్నారు.

విరక్తి పుట్టి..
భర్త వైఖరిని చూసి భార్య ఉమకు విరక్తి పుట్టింది. ఫేస్‌బుక్‌ స్నేహితులైన ఇద్దరు యువకులు శోభిత్‌ గౌడ (31), పవన్‌ (35)కు విషయం తెలిపింది. ప్లాన్‌ ప్రకారం సంతోష్‌కు నిద్రమాత్రలు మింగించారు. నిద్రలోకి జారుకోగానే దిండుతో ఊపిరాడకుండా హత్యచేశారు. పోలీసులు ఉమ ను విచారించగా భర్త ప్రవర్తనను ఏకరువు పెట్టింది. తమ పిల్లల ముందు కూడా నగ్నంగా తిరిగేవాడని, ఇది తట్టుకోలేక తాను ఫేస్‌బుక్‌ మిత్రులతో కలసి భర్తను హత్య చేశామని నేరం అంగీకరించింది. ఆ కుటుంబం కథ విని పోలీసులే ఆశ్చర్యపోయారు. ఆమె శోభిత్‌ గౌడతో సన్నిహితంగా ఉండేదని గుర్తించారు.

హార్డ్‌ డిస్కుల నిండా అవే
బనశంకరి: సంతోష్‌ ఇంటిలో సీజ్‌ చేసిన హార్డ్‌ డిస్కుల్లో హతుడు సంతోష్‌ యువతులు, మహిళలతో ఉన్న ప్రైవేటు వీడియోలు అనేకం ఉన్నాయి. మహిళలతో గడుపుతూ మొబైల్‌తో వీడియోలు తీసుకునేవాడు. తరువాత వాటిని కంప్యూటర్‌లో భద్రపరిచేవాడు. నిందితులను జైలుకు తరలించారు.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement