Meghana Raj Gets Chiranjeevi Sarja And Raayan's Names Tattooed On Her Wrist, Post Viral - Sakshi
Sakshi News home page

Meghana Raj: నటి మణికట్టుపై భర్త, కొడుకు పేరు పచ్చబొట్టు

Aug 26 2022 9:22 PM | Updated on Aug 27 2022 9:24 AM

Meghana Raj Inked Late Chiranjeevi Sarja And His Son Ryan Names - Sakshi

ప్రస్తుతం లాస్‌వెగాస్‌లో ఉన్న ఆమె చేతిపై పచ్చబొట్టు వేయించుకుంది...

కన్నడ సూపర్‌స్టార్‌ చిరంజీవి మరణం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది ఆయన సతీమణి, నటి మేఘనా రాజ్‌. తిరిగి తన కెరీర్‌పై ఫోకస్‌ పెట్టిన ఆమె ప్రస్తుతం పలు సినిమాలు చేస్తోంది. ఇదిలా ఉంటే ఆమె రెండో పెళ్లి చేసుకోనుందంటూ కొంతకాలంగా ఊహాగానాలు ఊపందుకోగా అవన్నీ వుట్టి పుకార్లేనని కొట్టిపారేసింది మేఘన. ప్రస్తుతం లాస్‌వెగాస్‌లో ఉన్న ఆమె చేతిపై పచ్చబొట్టు వేయించుకుంది.

భర్త చిరంజీవి సర్జా, కొడుకు రాయన్‌ పేర్లను మణికట్టుపై టాటూ వేసుకుంది. వారు ఎప్పటికీ తనగుండెలో ఉండిపోతారని చెప్పుకొచ్చింది. ఈ మేరకు ఓ ఫొటోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. కాగా చిరంజీవి సర్జా 2020 జూన్‌ 7న గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే!

చదవండి: విజయ్‌ తలపొగరు వల్ల మేము నష్టపోయాం: థియేటర్‌ యజమాని ఫైర్‌
11 ఏళ్లుగా షకీరాతో సహజీవనం, బ్రేకప్‌.. ఇప్పుడు ఇంకో అమ్మాయితో!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement