Late Chiranjeevi Sarja Wife Meghana Raj Sarja Reacts On Second Marriage Rumours - Sakshi
Sakshi News home page

Meghana Raj Sarja: మేఘనా సర్జా రెండో పెళ్లి? ఆమె ఏమందంటే?

Published Wed, Aug 24 2022 7:14 PM | Last Updated on Wed, Aug 24 2022 7:38 PM

Meghana Raj Sarja Reacts On Second Marriage Rumours - Sakshi

కన్నడ స్టార్‌ చిరంజీవి సర్జా మరణంతో ఎంతగానో కుంగిపోయింది ఆయన సతీమణి, నటి మేఘనా రాజ్‌. ఆ సమయంలో గర్భవతిగా ఉన్న ఆమె కొన్ని నెలల తర్వాత ఓ కుమారుడికి జన్మనిచ్చింది. తన కొడుకులోనే భర్తను చూసుకుంటూ కాలం వెళ్లదీస్తోందామె. అయితే ఆమె త్వరలో రెండో పెళ్లి చేసుకోబోతుందంటూ కొద్దికాలంగా ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఈ క్రమంలో ఆమె ఈ రూమర్‌పై స్పందించింది.

'కొందరు నన్ను మళ్లీ పెళ్లి చేసుకోమని సలహా ఇస్తున్నారు. మరికొందరేమో నా కొడుకును బాగా చూసుకుంటూ అతడితోనే ఉండమని సూచిస్తున్నారు. మరి నేను ఎవరి మాట వినాలి? నా భర్త చిరంజీవి ఎప్పుడూ ఒక మాట అంటూ ఉండేవాడు.. ఈ ప్రపంచం ఏమనుకుంటుందనేది ఎప్పుడూ పట్టించుకోకు, నీ మనసుకు ఏదనిపిస్తే అదే చేయమని చెప్పేవాడు. నేను మళ్లీ పెళ్లి గురించి నాకు నేను ఎప్పుడూ ప్రశ్నించుకోలేదు. రేపు ఏం జరుగుతుంది? కొద్ది రోజులయ్యాక నా జీవితం ఎలా ఉంటుంది? అని నేనెప్పుడూ ఆలోచించలేదు' అని మేఘన చెప్పుకొచ్చింది.

కాగా చిరంజీవి సర్జా, మేఘనా రాజ్‌ సుమారు పదేళ్లు ప్రేమలో మునిగి తేలాక 2018 మే 2న పెళ్లాడారు. మేఘనా గర్భం దాల్చిన కొన్ని నెలలకే చిరంజీవి సర్జా 2020 జూన్‌ 7న గుండెపోటుతో మరణించారు. వీరికి రాయన్‌ రాజ్‌ సర్జా అనే కొడుకు పుట్టాడు. మేఘన నటించిన బుద్ధివంత 2 సినిమా రిలీజ్‌కు రెడీ అవుతోంది. అలాగే ఆమె ఓ డ్యాన్స్‌ రియాలిటీ షోకు జడ్జిగానూ వ్యవహరిస్తోంది.

చదవండి: సింపుల్‌గా కనిపిస్తున్న ఈ డ్రెస్‌ ధర ఎంతో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే!
ఓటీటీలో రాజ్‌కుమార్‌ రావు హిట్‌, స్ట్రీమింగ్‌ అయ్యేది అప్పుడే!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement