తన భర్త, దివంగత నటుడు చిరంజీవి బర్త్‌డే సందర్భంగా భావోద్వేగానికి లోనయ్యింది కన్నడ నటి, ఆయన భార్య మేఘన సర్జా. సోమవారం(అక్టోబర్ 17) చిరంజీవి సర్జా జయంతి. ఈ సందర్భంగా భర్తను తలుచుకుంటూ ఆమె ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశారు. ‘హ్యాపీ బర్త్‌డే మై హ్యాపినేస్! నా సంతోషానికి కారణం ఎవరు, ఏంటీ అనేది కాదు.. అలాగే ఒకటి రెండు కారణాలు అసలే కాదు. కేవలం నీ నువ్వే. నీ వల్లే నేను నవ్వుతున్నాను మై డియర్ హస్బెండ్ చిరు.. ఐ లవ్ యూ!’ అంటూ భావోద్వేగానికి లోనయ్యారు.
చదవండి: విష్ణు నన్ను అలా అనడంతో షాకయ్యా: మంచు మోహన్ బాబు
ఇక ఆమె పోస్ట్ ఫాలోవర్స్, ఫ్యాన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. ‘మిమ్మల్ని చూసి ఆయన ఆత్మ గర్వపడుతుంది మేడం, మీరు నిజంగా గొప్ప భార్య’ అంటూ మేఘనాను ఉద్దేశిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా చిరంజీవి సర్జా 2020 జూన్ 7న గుండెపోటుతో కన్నుమూశారు. అప్పటికే గర్భవతి అయిన మేఘన అక్టోబర్ 22న మగబిడ్డకు జన్మనిచ్చారు. ఎపుడూ సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉండే మేఘనా తన కొడుకు పేరును రాయన్ రాజ్ సర్జాగా ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment