భావోద్వేగం: కుమారుడిని ఎత్తుకున్న చిరు సర్జా! | Fan Shares Chiranjeevi Sarja Photoshopped Pic With His Son | Sakshi
Sakshi News home page

భావోద్వేగం: కుమారుడిని ఎత్తుకున్న చిరు సర్జా!

Published Sat, Feb 13 2021 10:56 AM | Last Updated on Sat, Feb 13 2021 11:30 AM

Fan Shares Chiranjeevi Sarja Photoshopped Pic With His Son - Sakshi

కన్నడ నటి మేఘనా రాజ్‌కు ఓ అభిమాని అరుదైన బాహుమతి ఇచ్చింది. దివ్య అనే ఇన్‌స్టాగ్రామ్‌ యూజర్‌ ఇచ్చిన ఈ బాహుమతిని చూసి మేఘనాతో పాటు చిరంజీవి సర్జా అభిమానులు సైతం భావోద్వేగానికి లోనవుతున్నారు. కాగా గతేడాది మేఘనా పడ్డంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె తరచూ తన కుమారుడికి సంబంధించి ఫొటోలను షేర్‌ చేస్తూంటారు. ఈక్రమంలో ఆమె కుమారుడిని ఎత్తుకుని నవ్వుతున్న ఓ షాడో ఫొటోను ఇటీవల షేర్‌ చేశారు. ఇక ఈ ఫొటోను దివ్య అనే అభిమాని‌ మేఘనా స్థానంలో చిరు సర్జా ఫొటోను ఎడిట్‌ చేసి శనివారం తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసింది. దీనికి ‘తండ్రి ప్రేమ ఎప్పుడూ కుమారుడి హృదయంలో ముద్రించబడి ఉంటుంది’ అంటూ మేఘనాను ట్యాగ్‌ చేసింది. (చదవండి: మళ్లీ నా బిడ్డను చూస్తున్నట్టే ఉంది!)

ప్రస్తుతం ఈ ఫొటో నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. కుమారుడిని ఎత్తుకుని ఉన్న ఈ ఫొటోపై సర్జా అభిమానులు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ఇక దీనిపై మేఘనా సైతం స్పందిస్తూ భావోద్యేగానికి లోనయ్యారు. ఇంతటి అమూల్యమైన బహుమతినిచ్చినందుకు సదరు అభిమానికి ఆమె ధన్యవాదాలు తెలిపారు. కాగా చిరంజీవి-మేఘనాలు 2018లో మేలో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గతేడాది జూన్‌ 7న చిరు సర్జా గుండెపోటుతో మరణించాడు. ఇక అప్పటికే 5 నెలల గర్భవతిగా ఉన్న మెఘనా రాజ్‌ గతేడాది అక్టోబర్‌లో మగబిడ్డకు జన్మనిచ్చారు. (చదవండి: మన బిడ్డ రూపంలో నిన్ను తీసుకొస్తా!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement