Meghana Raj Ready for Her Second Marriage With Bigg Boss Kannada 4 Winner Pratham? - Sakshi
Sakshi News home page

Meghana Raj: నటి మేఘనా రాజ్‌ మళ్లీ పెళ్లి..? స్పందించిన బిగ్‌బాస్‌ విన్నర్‌

Published Tue, Sep 21 2021 1:49 PM | Last Updated on Tue, Sep 21 2021 5:28 PM

Actress Meghana Raj Remarriage to Bigg Boss 4 Winner Pratham Clarified as Rumour - Sakshi

నటి మేఘన రాజ్‌ కన్నడ, మలయాళ చిత్రసీమలోని అగ్ర కథానాయికలలో ఒకరు. ‘కాదల్ సొల్లా వందేన్’, 'నంద నందిత' వంటి చిత్రాలతో తమిళ ప్రేక్షకులకు సైతం సుపరిచితురాలే. అయితే గతేడాది ఆమె భర్త కన్నడ స్టార్‌ హీరో చిరంజీవీ సర్జా గుండెపోటుతో అక​స్మాత్తుగా మరణించాడు. ఆ సమయంలో నటి నాలుగు నెలల గర్భవతి. అనంతరం ఆమె ఓ కుమారుడికి జన్మనిచ్చింది.

అయితే చిరు మరణించిన దాదాపు ఏడాది తర్వాత మేఘన, కన్నడ ‘బిగ్‌బాస్‌ 4’ విన్నర్‌ ప్రథమ్‌ను వివాహం చేసుకోబోతున్నట్లు రూమర్స్‌ సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. వీటిపై ప్రథమ్‌ ట్విట్టర్‌లో తీవ్రంగా స్పందించారు. ఆయన యూట్యూబ్‌లోని ఓ వీడియోని షేర్‌ చేశాడు. ‘వ్యూస్‌, డబ్బు కోసం ఇతరులకు ఇబ్బంది కలిగించేలా రూమర్స్‌ ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికి వరకు ఈ వీడియోను పట్టించుకోలేదు కానీ దాదాపు 2.7 లక్షలపైగా దీన్ని చూశారు. వీటిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటేనే ఇంకొకరు  ఇలాంటివి పెట్టకుండా ఉంటారు’ అని ఆయన తెలిపాడు.
(చదవండి: Keerthy Suresh: కమెడియన్‌కి జోడీగా కీర్తీ సురేష్‌..?)

కాగా, మేఘనా రాజ్‌ ఇప్పటివరకు ఈ రూమర్స్‌పై స‍్పందించలేదు. కానీ తన దివంగత భర్త చిరంజీవి కోరిక మేరకు నటనపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఈ నటులు ఇద్దరూ దాదాపు పది సంవత్సరాలు ప్రేమించుకొని 2018లో వివాహం చేసుకు​న్నారు. భర్త అకాల మరణంతో నటి ఎంతో కుంగిపోయింది. ఈ తరుణంలో ఇటువంటి పుకార్లు రావడం ఆమెను ఎంతో ఇబ్బంది పెడుతున్నాయి. చిరు మరణం అనంతరం తరచుగా ఆయన ఫోటోలు సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ భర్తపై ప్రేమని వ్యక్తం చేస్తుంటుంది.
(చదవండి: కోర్టుపై నమ్మకం పోయింది: కంగనా రనౌత్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement