ఇంతకంటే మంచి సమయం లేదు..ఇది మన కల: మేఘనా రాజ్‌ | Meghana Raj announces her comeback film on husbands birthday | Sakshi
Sakshi News home page

Meghana Raj :ఇంతకంటే మంచి సమయం లేదు: మేఘన

Published Mon, Oct 18 2021 7:09 PM | Last Updated on Mon, Oct 18 2021 7:47 PM

Meghana Raj announces her comeback film on husbands birthday - Sakshi

సాక్షి, ముంబై: నటి  మేఘనా రాజ్‌ తాను మళ్లీ నటించబోతున్నట్టు ప్రకటించింది. మేఘనా భర్త, దివంగత కన్నడ నటుడు చిరంజీవి సర్జా సన్నిహితుడు పన్నగా భరణ నిర్మిస్తున్న సినిమా ద్వారా మళ్లీ మూవీల్లోకి రావడానికి సిద్ధంగా ఉన్నానంటూ అక్టోబర్ 17, ఆదివారం ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. ఈ సందర్భంగా పన్నగ భరణ, నూతన దర్శకుడు విశాల్‌తో చిత్రాలను ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసింది. థ్రిల్లర్‌గా తెరకెక్కనున్న ఈ  సినిమాలో మేఘనా లీడ్‌ రోల్‌లో నటించనుంది.
చదవండి: Samantha: అంత పవర్‌ ఎలా ... మీరంటే భయం అందుకే : సమంత

ఈ రోజు నీ పుట్టిన రోజు, ఇది మన కల... ఈ విషయాన్ని తెలియజేసేందుకు ఇంతకంటే మంచి సమయం లేదు అంటూ తన భర్త రెండో  జయంతిని పురస్కరించుకుని ఈ ప్రకటన చేసింది మేఘనా. మన కలని బహుమతిగా ఇచ్చేందుకు ఇంతకంటే మంచి టీం కూడా తనకు దొరకదని ఆమె వ్యాఖ్యానించింది. అంతేకాదు నిర్మాత పన్నగా లేకపోతే తాను ఈ ప్రాజెక్ట్ గురించి ఆలోచించనని కూడా తెలిపింది. 

కాగా మేఘన భర్త, కన్నడ హీరో చిరు సర్జా 2020, జూన్‌ 7న తీవ్రమైన గుండెపోటుతో కన్నుమూశారు. అప్పటికే గర్భవతి అయిన మేఘన అక్టోబర్‌ 22న మగబిడ్డకు జన్మనిచ్చింది. ఎపుడూ సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉండే మేఘనా గత నెలలో తన కొడుకు పేరును రాయన్‌ రాజ్‌ సర్జాగా రివీల్‌ చేసింది. అంతేకాదు కొడుకుతో కలిసి జరుపుకున్న దసరా వేడుకల ఫోటోలు, వీడియోలను కూడా షేర్ చేసింది. మరోవైపు అక్టోబర్ 22 న రాయన్‌ ఫస్ట్‌ బర్తడే జరుపుకోనున్నాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement