comeback to silver screen
-
ఇంతకంటే మంచి సమయం లేదు..ఇది మన కల: మేఘనా రాజ్
సాక్షి, ముంబై: నటి మేఘనా రాజ్ తాను మళ్లీ నటించబోతున్నట్టు ప్రకటించింది. మేఘనా భర్త, దివంగత కన్నడ నటుడు చిరంజీవి సర్జా సన్నిహితుడు పన్నగా భరణ నిర్మిస్తున్న సినిమా ద్వారా మళ్లీ మూవీల్లోకి రావడానికి సిద్ధంగా ఉన్నానంటూ అక్టోబర్ 17, ఆదివారం ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఈ సందర్భంగా పన్నగ భరణ, నూతన దర్శకుడు విశాల్‌తో చిత్రాలను ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. థ్రిల్లర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమాలో మేఘనా లీడ్ రోల్లో నటించనుంది. చదవండి: Samantha: అంత పవర్ ఎలా ... మీరంటే భయం అందుకే : సమంత ఈ రోజు నీ పుట్టిన రోజు, ఇది మన కల... ఈ విషయాన్ని తెలియజేసేందుకు ఇంతకంటే మంచి సమయం లేదు అంటూ తన భర్త రెండో జయంతిని పురస్కరించుకుని ఈ ప్రకటన చేసింది మేఘనా. మన కలని బహుమతిగా ఇచ్చేందుకు ఇంతకంటే మంచి టీం కూడా తనకు దొరకదని ఆమె వ్యాఖ్యానించింది. అంతేకాదు నిర్మాత పన్నగా లేకపోతే తాను ఈ ప్రాజెక్ట్ గురించి ఆలోచించనని కూడా తెలిపింది. కాగా మేఘన భర్త, కన్నడ హీరో చిరు సర్జా 2020, జూన్ 7న తీవ్రమైన గుండెపోటుతో కన్నుమూశారు. అప్పటికే గర్భవతి అయిన మేఘన అక్టోబర్ 22న మగబిడ్డకు జన్మనిచ్చింది. ఎపుడూ సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉండే మేఘనా గత నెలలో తన కొడుకు పేరును రాయన్ రాజ్ సర్జాగా రివీల్ చేసింది. అంతేకాదు కొడుకుతో కలిసి జరుపుకున్న దసరా వేడుకల ఫోటోలు, వీడియోలను కూడా షేర్ చేసింది. మరోవైపు అక్టోబర్ 22 న రాయన్ ఫస్ట్ బర్తడే జరుపుకోనున్నాడు. View this post on Instagram A post shared by Meghana Raj Sarja (@megsraj) View this post on Instagram A post shared by Meghana Raj Sarja (@megsraj) View this post on Instagram A post shared by Meghana Raj Sarja (@megsraj) -
బ్రేక్ తీసుకుంటే కమ్‌బ్యాక్ అంటారా?
‘‘ఒక హీరో చాలా కాలం సినిమాలకు దూరంగా ఉంటే... మీ కమ్‌బ్యాక్ ఎప్పుడు? అని ఆ హీరోని ఎవరూ అడగరు. కానీ అదే ఒక హీరోయిన్ కాస్త బ్రేక్ తీసుకుంటే చాలు.. మీ కమ్‌బ్యాక్ ఎప్పుడు? అనే ప్రశ్నను పదే పదే అడుగుతారు. ఒక వర్కింగ్ ఉమెన్ను అలా అడగటం మానేయండి’’ అన్నారు నటి మాధురీ దీక్షిత్. 1999లో శ్రీరామ్ నేనేను వివాహం చేసుకున్న మాధురి సినిమాలను తగ్గించారు. 2007లో ‘ఆజా నాచ్లే’ సినిమా తర్వాత మాధురి తిరిగి సినిమాలకు బ్రేక్ ఇచ్చారు. ఆ తర్వాత అడపాదడపా అతిథి పాత్రలు మాత్రమే చేశారు. గత నెల విడుదలైన ‘టోటల్ ధమాల్’ సినిమాలో ఆమె ఫుల్ లెంగ్త్ లీడ్ రోల్ చేశారు. ఈ సినిమాతో మంచి కమ్‌బ్యాక్ ఇచ్చారని మాధురితో ఎవరో అన్నారట. అంతే.. ఆమె అసహనం వ్యక్తం చేశారు. ‘‘నా వ్యక్తిగత కారణాల వల్ల కొన్నేళ్లు నేను సినిమాలు చేయలేదు. ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ నేను ఇండస్ట్రీకి దూరం కాలేదు. సినిమాలకు దూరం కానప్పుడు ఇక కమ్‌బ్యాక్ అనే ప్రసక్తి ఎందుకు? నా వైవాహిక బంధాన్ని ఆస్వాదించాలనుకున్నాను. నా కుటుంబసభ్యులతో, నా పిల్లలతో సరదాగా కొంత కాలం గడపాలనుకున్నాను. అందుకే సినిమాలు ఒప్పుకోలేదు. ప్రొఫెషనల్ లైఫ్‌కి కొంత గ్యాప్ ఇస్తే ‘మీ కమ్‌బ్యాక్ ఎప్పుడు?’ అని అడగడమేనా?’’ అని అసహనం వ్యక్తం చేశారు మాధురీ దీక్షిత్. -
తిరిగొస్తున్నారు
‘ఎగిరే పావురమా, పెళ్లి చేసుకుందాం, మిస్టర్ అండ్ మిస్ శైలజా కృష్ణమూర్తి’ చిత్రాల ద్వారా హీరోయిన్ లైలా సుపరిచితురాలే. తమిళ, కన్నడ భాషల్లోనూ హిట్ చిత్రాల్లో నటించారామె. 2006లో వివాహం చేసుకున్న తర్వాత సినిమాలకు దూరమయ్యారు. గతేడాది తమిళంలో ఓ టీవీ షోలో జడ్జిగా కనిపించారు. తాజాగా తమిళ చిత్రం ‘అలీసా’ ద్వారా నటిగా తన సెకండ్ ఇన్నింగ్స్‌ను స్టార్ట్ చేయనున్నారట. యువన్ శంకర్ రాజా నిర్మించనున్న ఈ చిత్రం ద్వారా మని చంద్రు అనే నూతన దర్శకుడు పరిచయం కానున్నారు. ఈ సినిమా కాకుండా ‘కండ నాళ్ ముదల్’ సీక్వెల్లో కూడా లైలా యాక్ట్ చేయబోతారనే వార్త ప్రచారంలో ఉంది. మరి తెలుగు సినిమాల్లో కూడా కనిపిస్తారా? చూద్దాం. -
మళ్లీ వెండితెర మీదకు జయప్రద
తెలుగు తెరను కొన్ని దశాబ్దాల పాటు ఏలి.. ఇక్కడి నుంచి బాలీవుడ్‌కు వెళ్లి అక్కడ కూడా రాజ్యమేలి.. తర్వాత రాజకీయ రంగ ప్రవేశం చేసిన జయప్రద.. మళ్లీ ఇప్పుడు ముఖానికి మేకప్ వేసుకుని వెండితెరమీద దర్శనం ఇవ్వబోతున్నారు. సంజయ్ శర్మ దర్శకత్వంలో రాబోతున్న థ్రిల్లర్ మూవీలో ఆమె ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం 5 పదుల వయసు దాటినా కూడా ఇప్పటికీ తనలోని టాలెంట్ ఏమాత్రం తగ్గలేందంటున్న జయప్రద.. చిట్టచివరిసారిగా కంగనా రనౌత్‌తో కలిసి 2013లో రజ్జో అనే సినిమాలో సైడ్ క్యారెక్టర్ చేశారు. ఇప్పుడు కొత్త సినిమాలో చేయడానికి తాను చాలా ధైర్యంగా నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని జయప్రద అంటున్నారు. రాణీ సాహిబా అనే తన పాత్ర చాలా గ్లామరస్‌గా ఉంటూనే అందులో నెగెటివ్ షేడ్ కూడా ఉంటుందని ఆమె చెప్పారు. నేటి ప్రేక్షకులు భిన్నమైన కథలు కోరుకుంటున్నారని అన్నారు. ఇప్పటివరకు తాను ఇలాంటి పాత్ర ఏదీ చేయలేదని, అందుకే ఈ సినిమా చాలా ధైర్యంగా చేయాల్సి వస్తోందని జయ అన్నారు. ఈ సినిమా షూటింగ్ మలేసియా, శ్రీలంక, నేపాల్ దేశాల్లో సాగుతోంది. ఈ హిందీ సినిమాతో పాటు ఓ మళయాళం సినిమాలో కూడా జయప్రద చేస్తోంది.