ఆ హీరోయిన్కి లవరున్నాడహో!
చెన్నై : నటి మేఘ్నారాజ్‌కు లవరున్నాడట. ఈ విషయాన్ని ఆ భామ చెప్పకనే చెప్పేసింది. అసలు నటి మేఘ్నారాజ్ గుర్తుందా? ఆ మధ్య తమిళంలో కాదల్ సొల్లవందేన్, ఉయిర్‌తిరు 420, నందానందిత చిత్రాల్లో కథానాయికగా నటించారు. ప్రస్తుతం కన్నడంలో నటిస్తున్న ఈ బ్యూటీ తెలుగు, మలయాళ భాషల్లోనూ కొన్ని చిత్రాలు చేసింది. కాగా ఈ అమ్మడు లవ్‌లో పడ్డట్టు కొద్ది కాలంగా ప్రచారం జోరందుకుంది. మేఘ్నారాజ్, కన్నడ నటుడు చిరంజీవి సార్జా ప్రేమలో పడ్డారని, ఇద్దరూ పార్టీలు, ఇతర కార్యక్రమాలకు చెట్టాపట్టాలేసుకు తిరుగుతున్నారని వదంతులు హల్‌చల్ చేస్తున్నా ఖండించలేదు కదా అసలు వాటిని పట్టించుకోలేదు.
ఇటీవల చిరంజీవి సార్జా తమ్ముడు ధ్రువ పుట్టిన రోజును పురస్కరించుకుని మేఘ్నారాజ్ ట్విట్టర్‌లో శుభాకాంక్షలు తెలుపుతూ అలవాటులో పొరపాటు అన్నట్లు.... నా మరిదికి పుట్టిన రోజు శుభాకాంక్షలు అని పేర్కొంది. అలా మేఘ్నారాజ్ నటుడు చిరంజీవి సార్జాతో తన ప్రేమని చెప్పకనే చెప్పేయడం సినీ వర్గాల్లో సంచలన సృష్టిస్తోంది. మేఘ్నారాజ్‌కు ప్రియుడున్నాడు అంటూ ప్రచారం హల్‌చల్ చేస్తోంది.ఇంతకీ నటుడు చిరంజీవి సాన్జా ఎవరని ఆరా తీస్తే ఆయన నటుడు అర్జున్‌కు దగ్గర బంధువు అని తెలిసింది.