![Baby boy for Meghana Raj and late actor Chiranjeevi Sarja - Sakshi](/styles/webp/s3/article_images/2020/10/22/MeghanaRaj.jpg.webp?itok=p0-4vVns)
సాక్షి, బెంగళూరు : దివంగత కన్నడ హీరో చిరంజీవి సర్జా భార్య, నటి మేఘనా రాజ్ గురువారం మగబిడ్డకు జన్మనిచ్చారు. దక్షిణ బెంగళూరులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో బాబు పుట్టాడని చిరంజీవి సర్జా సోదరుడు, నటుడు ధ్రువ సర్జా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. తమ అన్నయ్యే మళ్లీ పుడతాడంటూ చెప్పకొస్తున్న ధ్రవ "బేబీ బాయ్, జై హనుమాన్" అంటూ ఆనందం ప్రకటించారు.
స్వీట్లు పంచి సంతోషాన్ని వ్యక్తం చేశారు. అలాగే తన బిడ్డకు వెండి ఉయ్యాల కావాలన్న అన్న కోరికను నేరవేర్చానని ధ్రువ తెలిపారు. బాబుకి ఏపేరు పెట్టాలన్నది ఇంకా నిర్ణయించలేదన్నారు. చాలా సంతోసంగా ఉంది..మళ్లీ నా చిరంజీవిని చూస్తున్నట్టు ఉందంటూ చిరంజీవి సర్జా తల్లి ఉద్వేగానికి లోనయ్యారు. ఈ రోజు మేఘనా, చిరంజీవి నిశ్చితార్థం చేసుకున్న రోజని కూడా ఆమె గుర్తు చేసుకున్నారు.
కాగా చిరంజివి సర్జా 36 ఏళ్ల వయసులో గుండెపోటుతో ఆకస్మికంగా కన్నుమూయడం అటు కుటుంబ సభ్యులను, ఇటు అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. అయితే చిరంజీవి చనిపోయే సమయానికే అతని భార్య మేఘనా రాజ్ గర్భవతి. ఇటీవల మేఘనా బేబీ షవర్ చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment