TV actress Pavithra Lakshmi gets emotional about her mom's demise - Sakshi
Sakshi News home page

Pavithra Lakshmi: 'ఇంత త్వరగా ఎలా విడిచి వెళ్లావ్'.. బుల్లితెర నటి తీవ్ర భావోద్వేగం

May 24 2023 4:45 PM | Updated on May 24 2023 5:56 PM

TV actress Pavithra Lakshmi gets emotional about her mom demise - Sakshi

నాకు నిన్ను ఓ సారి చూడాలని ఉంది. నీతో ఒకసారి మాట్లాడాలని ఉంది. నీ చేతి ముద్దలు తినాలని ఉంది.  

ఇటీవల సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. గతవారం తమిళ బుల్లితెర నటి ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె తల్లి  ఏడు రోజుల క్రితం కన్నుమూశారు. ఈ విషాద ఘటనను తలుచుకుంటూ  నటి పవిత్ర లక్ష‍్మి తన ఇన్‌స్టాలో ఎమోషనల్ పోస్ట్ చేశారు. 

(ఇది చదవండి: 'ఇండియన్ ఐడల్ సీజన్ 2' ఫినాలేకు చీఫ్‌ గెస్ట్‌గా బన్నీ)
 
ఇన్‌స్టాలో పవిత్ర రాస్తూ.. 'నువ్వు మమ్మల్ని విడిచివెళ్లి అప్పుడే ఏడు రోజులైంది. ఈ బాధ నుంచి బయటపడాలని చూస్తున్నా. నువ్వు ఎందుకింత త్వరగా వదిలి వెళ్లిపోయావో అర్థం కావటం లేదు. దాదాపు 5 ఏళ్లుగా నువ్వు అనుభవించిన కష్టాలు, బాధలు అక్కడ ఉండవని భావిస్తున్నా. నువ్వు ఒక సూపర్ మామ్. సింగిల్‌ పేరెంట్‌గా ఉంటూ బిడ్డల్ని చూసుకోవటం అంత తేలికైన విషయం కాదు. నాకు నిన్ను ఓ సారి చూడాలని ఉంది. నీతో ఒకసారి మాట్లాడాలని ఉంది. నీ చేతి ముద్దలు తినాలని ఉంది.  ఈ కష్ట సమయంలో నా పక్షాన నిలిచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు.' అంటూ పోస్ట్ చేసింది. ఇది చూసిన సినీ ప్రముఖులు ఆమెకు సంఘీభావం ప్రకటించారు.

(ఇది చదవండి: హన్సికను వేధించిన టాలీవుడ్‌ హీరో? స్పందించిన హీరోయిన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement