Tamil TV Actress Shalini Celebrates Divorce Photoshoot Goes Viral On Social Media - Sakshi
Sakshi News home page

TV Actress Shalini Divorce: బుల్లితెర నటికి విడాకులు.. సెలబ్రేషన్స్ మామూలుగా లేవుగా!

Published Tue, May 2 2023 3:19 PM | Last Updated on Tue, May 2 2023 3:30 PM

Tamil TV actress Shalini divorce photoshoot goes viral - Sakshi

ఎవరైనా వేడుకలు చేసుకోవాలంటే ఓ సందర్భం అంటూ ఉండాలి. బర్త్‌ డే, మ్యారేజ్ డే, ఇంకా ఏదైనా స్పెషల్ డేస్‌లో పార్టీ చేసుకుంటాం. ప్రతి ఒక్కరి జీవితంలో కొన్ని బాధాకరమైన సందర్భాలు కూడా ఉంటాయి. మరీ ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలో సెలబ్రిటీలు ఎక్కువగా వేడుకలు జరుపుకోవడం మనం చూస్తుంటాం. ఇవన్నీ పక్కనే పెడితే వీరిపై విడాకుల వార్తలు ఎక్కవగా వింటుంటాం.

(ఇది చదవండి: తెలియక ఆ తప్పులు చేశాను.. కానీ ఇప్పుడు అవి తెలుసుకున్నా: రష్మీ)

ఎవరైనా సెలబ్రిటీ జంటలు విడాకులు తీసుకుంటే వారితో పాటు అభిమానులు బాధపడతారు. కానీ అందుకు భిన్నంగా విడాకుల  అలాగే తాజాగా ఓ బుల్లితెర నటి విడాకులు తీసుకుంది. అయితే ఈ విషయానికి ఆమె ఎలాంటి బాధను వ్యక్తం చేయలేదు. పైగా ఈ సందర్భాన్ని గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంది. ఏకంగా ఫోటో షూట్‌ నిర్వహించింది. ఇంతకీ ఆమె ఎవరో ఓ లుక్కేద్దాం. 

తమిళ ఇండస్ట్రీకి చెందిన బుల్లితెర నటి షాలిని ముల్లుమ్ మల్లరుమ్ అనే తమిళ సీరియల్‌తో ఫేమ్ తెచ్చుకుంది. జీ తమిళ్‌లో ప్రసారమయ్యే సూపర్ మామ్ రియాల్టీ షోలో కూడా కనిపించింది. అయితే గతంలో రియాజ్‌ను వివాహం చేసుకున్న షాలినికి రియా అనే కుమార్తె కూడా ఉంది. కొన్ని నెలల క్రితం షాలిని భర్త రియాజ్ తనను శారీరకంగా, మానసికంగా వేధించేవాడని విడాకుల కోసం కోర్టును ఆశ్రయించింది. తాజాగా కోర్టు విడాకులు మంజూరు కావడంతో ఫోటో షూట్ నిర్వహించి మరీ గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంది. దీనికి సంబంధించిన ఫోటోలను తన ఇన్‌స్టాలో షేర్ చేసింది బుల్లితెర నటి. 

(ఇది చదవండి: అలాంటి వారిని పూర్తిగా వదిలేయండి.. రష్మీ పోస్ట్ వైరల్)

షాలిని తన ఇన్‌స్టాలో రాస్తూ..'విడాకులు తీసుకున్న వారికి ఇదే నా సందేశం. వివాహాబంధాన్ని విడిచిపెట్టడం సరైన నిర్ణయమే. ఈ విషయంలో మీరు సంతోషంగా ఉండటానికి అర్హులు. మీ జీవితం అనేది మీ చేతుల్లోనే ఉంది. మీ పిల్లలకు మంచి భవిష్యత్తును ఇవ్వడానికి ఇలాంటి వాటిని ఎదుర్కొవాల్సిందే. విడాకుల తీసుకుంటే మనం ఫెయిల్ అయినట్లు కాదు. మీ లైఫ్‌లో ఇది టర్నింగ్ పాయింట్. మీ జీవితంలో సానుకూల మార్పులకు సంకేతం. ఇలా నిలబడాలంటే చాలా ధైర్యం కావాలి. అందుకే నాలాగా ధైర్యవంతులైన మహిళలందరికీ నేను దీన్ని అంకితం చేస్తున్నా.' అంటూ పోస్ట్ చేసింది. మాజీ భర్త ఫోటోను చింపివేస్తూ మరీ ఫోటోలకు ఫోజులిచ్చింది. విడాకులు తీసుకోవడాన్ని ఇలా సెలబ్రేట్‌ చేసుకుంటారా నెటిజన్స్ అవాక్కవుతున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement