Super Mom
-
విడాకుల ఫోటోషూట్.. ఇదేం ట్రెండ్ రా బాబు!
ఎవరైనా వేడుకలు చేసుకోవాలంటే ఓ సందర్భం అంటూ ఉండాలి. బర్త్ డే, మ్యారేజ్ డే, ఇంకా ఏదైనా స్పెషల్ డేస్‌లో పార్టీ చేసుకుంటాం. ప్రతి ఒక్కరి జీవితంలో కొన్ని బాధాకరమైన సందర్భాలు కూడా ఉంటాయి. మరీ ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలో సెలబ్రిటీలు ఎక్కువగా వేడుకలు జరుపుకోవడం మనం చూస్తుంటాం. ఇవన్నీ పక్కనే పెడితే వీరిపై విడాకుల వార్తలు ఎక్కవగా వింటుంటాం. (ఇది చదవండి: తెలియక ఆ తప్పులు చేశాను.. కానీ ఇప్పుడు అవి తెలుసుకున్నా: రష్మీ) ఎవరైనా సెలబ్రిటీ జంటలు విడాకులు తీసుకుంటే వారితో పాటు అభిమానులు బాధపడతారు. కానీ అందుకు భిన్నంగా విడాకుల అలాగే తాజాగా ఓ బుల్లితెర నటి విడాకులు తీసుకుంది. అయితే ఈ విషయానికి ఆమె ఎలాంటి బాధను వ్యక్తం చేయలేదు. పైగా ఈ సందర్భాన్ని గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంది. ఏకంగా ఫోటో షూట్ నిర్వహించింది. ఇంతకీ ఆమె ఎవరో ఓ లుక్కేద్దాం. తమిళ ఇండస్ట్రీకి చెందిన బుల్లితెర నటి షాలిని ముల్లుమ్ మల్లరుమ్ అనే తమిళ సీరియల్‌తో ఫేమ్ తెచ్చుకుంది. జీ తమిళ్లో ప్రసారమయ్యే సూపర్ మామ్ రియాల్టీ షోలో కూడా కనిపించింది. అయితే గతంలో రియాజ్‌ను వివాహం చేసుకున్న షాలినికి రియా అనే కుమార్తె కూడా ఉంది. కొన్ని నెలల క్రితం షాలిని భర్త రియాజ్ తనను శారీరకంగా, మానసికంగా వేధించేవాడని విడాకుల కోసం కోర్టును ఆశ్రయించింది. తాజాగా కోర్టు విడాకులు మంజూరు కావడంతో ఫోటో షూట్ నిర్వహించి మరీ గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంది. దీనికి సంబంధించిన ఫోటోలను తన ఇన్‌స్టాలో షేర్ చేసింది బుల్లితెర నటి. (ఇది చదవండి: అలాంటి వారిని పూర్తిగా వదిలేయండి.. రష్మీ పోస్ట్ వైరల్) షాలిని తన ఇన్‌స్టాలో రాస్తూ..'విడాకులు తీసుకున్న వారికి ఇదే నా సందేశం. వివాహాబంధాన్ని విడిచిపెట్టడం సరైన నిర్ణయమే. ఈ విషయంలో మీరు సంతోషంగా ఉండటానికి అర్హులు. మీ జీవితం అనేది మీ చేతుల్లోనే ఉంది. మీ పిల్లలకు మంచి భవిష్యత్తును ఇవ్వడానికి ఇలాంటి వాటిని ఎదుర్కొవాల్సిందే. విడాకుల తీసుకుంటే మనం ఫెయిల్ అయినట్లు కాదు. మీ లైఫ్‌లో ఇది టర్నింగ్ పాయింట్. మీ జీవితంలో సానుకూల మార్పులకు సంకేతం. ఇలా నిలబడాలంటే చాలా ధైర్యం కావాలి. అందుకే నాలాగా ధైర్యవంతులైన మహిళలందరికీ నేను దీన్ని అంకితం చేస్తున్నా.' అంటూ పోస్ట్ చేసింది. మాజీ భర్త ఫోటోను చింపివేస్తూ మరీ ఫోటోలకు ఫోజులిచ్చింది. విడాకులు తీసుకోవడాన్ని ఇలా సెలబ్రేట్ చేసుకుంటారా నెటిజన్స్ అవాక్కవుతున్నారు. View this post on Instagram A post shared by shalini (@shalu2626) -
‘సూపర్ మామ్’ కాలర్‌వాలీ ఇక లేదు.. సీఎం చౌహాన్ విచారం
సియోని (మధ్యప్రదేశ్): ఆవు, గేదె లాంటివి తమ జీవితకాలంలో అధికసంఖ్యలో పిల్లలను కంటే దాని యజమానుల ఆనందమే వేరు. సంతాన లక్ష్మి, అంటూ సగర్వంగా చెప్పుకుంటారు. అలాంటిది ఏకంగా 29 పిల్లల్ని కంటే. ఈ పులి అదే చేసింది. 29 పులి పిల్లలకు జన్మనిచ్చింది. మధ్యప్రదేశ్‌లోని పెంచ్ టైగర్ రిజర్వు (పీటీఆర్)కు గర్వకారణంగా నిలిచిన ఈ విఖ్యాత పులి పేరు ‘కాలర్‌వాలీ’. ఈ సూపర్ మామ్ 17 ఏళ్ల వయసులో శనివారం కన్నుమూసింది. పులి సాధారణ జీవితకాలం 12 ఏళ్లు. కాలర్‌వాలీ దానికి మించి ఐదేళ్లు బతికి వృద్ధా్దప్య సమస్యలతో మరణించింది. చివరిసారిగా ఈనెల 14న సందర్శకులకు కనిపించిన కాలర్‌వాలీ చాలా బలహీనంగా ఉందని, వారం రోజులుగా దాని ఆరోగ్యాన్ని పరిశీలిస్తున్నామని పెంచ్ టైగర్ రిజర్వ్ ఒక ప్రకటనలో తెలిపింది. ఒకే కాన్పులో ఐదు పిల్లలు... కాలర్‌వాలీ మొత్తం ఎనిమిది కాన్పుల్లో 29 పులి పిల్లలకు జన్మనివ్వగా... ఇందులో 25 బతికాయి. 2008లో మొదటిసారిగా తల్లి అయిన కాలర్‌వాలీ మూడు పిల్లలను కన్నది. దురదృష్టవశాత్తు ఇందులో ఒక్కటీ బతకలేదు. 2010 అక్టోబరులో ఒకే కాన్పులో ఐదు పిల్లలకు (నాలుగు మగ కూనలు, ఒక ఆడపులి పిల్ల) జన్మనిచ్చింది. చివరిసారిగా 2018 డిసెంబరులో నాలుగు పిల్లలకు జన్మనిచ్చింది. దాంతో ఈ మహాతల్లి కడుపున పుట్టిన పులి పిల్లల సంఖ్య 29కి చేరింది. అడవిలో పులుల సంఖ్య గణనకు, వాటి ప్రవర్తనను గమనించేందుకు, జాడను కనిపెట్టేందుకు రేడియో సిగ్నల్స్‌ను పంపే పట్టీలకు పులుల మెడకు కడతారు. 2008లో కట్టిన పట్టీ పనిచేయకపోవడంతో 2010 మరో పట్టీని ‘టి15’గా పిలిచే ఈ పులికి కట్టారు. దాంతో దీనికి కాలర్‌వాలీ అనే పేరొచ్చింది. మధ్యప్రదేశ్‌లో 526 పులులున్నాయి. 2018లో అత్యధిక పులులున్న రాష్ట్రంగా అవతరించిన మధ్యప్రదేశ్ భారతదేశపు ‘టైగర్ స్టేట్’గా గుర్తింపు పొందింది. కాలర్‌వాలీ పెంచ్ రిజర్వు పెద్ద ఆకర్షణగా ఉండేది. ‘సూపర్ మామ్ కాలర్‌వాలీకి నివాళులు. 29 పిల్లలతో మధ్యప్రదేశ్‌కు గర్వకారణంగా నిలిచింది. అని రాష్ట్ర సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ ఓ ట్వీట్లో విచారం వ్యక్తం చేశారు. मप्र को टाइगर स्टेट का दर्जा दिलाने में महत्वपूर्ण भूमिका निभाने वाली, मध्यप्रदेश की शान व 29 शावकों की माता @PenchMP की ‘सुपर टाइग्रेस मॉम’ कॉलरवाली बाघिन को श्रद्धांजलि। पेंच टाइगर रिजर्व की 'रानी' के शावकों की दहाड़ से मध्यप्रदेश के जंगल सदैव गुंजायमान रहेंगे। pic.twitter.com/nbeixTnnWv — Shivraj Singh Chouhan (@ChouhanShivraj) January 16, 2022 -
సూపర్ మామ్
మాతృత్వం పేగుబంధానికే పరిమితం కాదని రుజువు చేస్తోంది సూపర్ మామ్. నా అన్న వారు లేని పిల్లలకు.. అక్కున చేర్చుకునే మాతృమూర్తులను పరిచయం చేస్తోందీ కొత్త కాన్సెప్ట్. అనాథఆశ్రమాల్లో అమ్మ లాలన కోసం ఆశగా ఎదురు చూసే చిన్నారులకు ఆత్మీయత చూపి వారి జీవన విధానాన్ని మార్చే ప్రయత్నంలో భాగంగానే ‘సూపర్ మామ్’ను ప్రారంభించామని అంటున్నారు మార్గ్ ఫౌండేషన్ ఫౌండర్ నఫీసా ఇస్మాయిల్. ఎవరూ లేని అనాథలను భావిభారత పౌరులుగా తీర్చిదిద్దడంలో కీలకమైన ‘అమ్మ’ పాత్రను పోషించడానికి మాతృమూర్తులను స్వాగతిస్తున్నారు. ఈ అమ్మదనం గురించి మరిన్ని విశేషాలు నఫీసా మాటల్లోనే.. - వాంకె శ్రీనివాస్ సిటీవాసులు చాలా మంది బర్త్‌డే సెలబ్రేషన్స్ అని, పెళ్లి రోజు వేడుకలని.. ఇలా ఏదో ఒక సందర్భాన్ని పురస్కరించుకొని అనాథ ఆశ్రమాలకు వెళ్లి అక్కడి పిల్లలతో కలసి సంబరాలు చేసుకోవడం పెరిగిపోయింది. వేడుకలు చేసుకోవడం వరకు బాగానే ఉన్నా.. మనకు తెలియకుండానే ఆ పిల్లలకు మరింత వేదనను మిగులుస్తున్నామన్నది మరచిపోతున్నాం. మన పిల్లలతో కేక్ కట్ చేసి ప్రేమానురాగాలను వాళ్ల కళ్లకు కడుతుంటే.. నా అనే వాళ్లు లేని పిల్లలకు పేరేంట్స్ గుర్తొస్తుంటారు. మనకు అలాంటి లైఫ్ ఎందుకు లేదా అని లోలోపలే ఆవేదన చెందుతుంటారు. అనాథాశ్రమాలకు వెళ్లి బర్త్ డే సెలబ్రేషన్స్, అన్నదానం, విద్యాదానానికి మాత్రమే పరిమితం కాకుండా.. ప్రతి నెలలో వీలైనన్నిసార్లు వాళ్లని కలసి సమస్యలను తెలుసుకొని గైడ్ చేస్తే ఎలా ఉంటుందని ఆలోచించేదాన్ని. స్నేహితుల ప్రోత్సాహంతో... నాలుగేళ్ల క్రితం క్రిమినల్ లాయర్‌గా పనిచేస్తున్నప్పుడు వరకట్న హత్య, అత్యాచారం కేసుల్లో చాలా మంది పిల్లలు పేరేంట్స్‌కు దూరమవుతుండటం చూశా. వీరు జైలులో మగ్గుతుంటే.. అమ్మమ్మ, తాత ఉన్నా పేదరికం అడ్డురావడంతో పిల్లలని అనాథశ్రమాల్లో చేర్పిస్తుండటం చాలా బాధించింది. ఈ విషయాన్ని స్పెయిన్‌లో ఉన్న మా ఫ్రెండ్స్‌తో చర్చించా. ‘సూపర్ మామ్’ ఆలోచనను పంచుకున్నా. వాళ్లు నన్ను ముందుకు వెళ్లమని ప్రోత్సహించడంతో.. ఇప్పుడు ఈ ప్రాజెక్టుతో బిజీగా మారిపోయాను. ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న అనాథాశ్రమాల ద్వారానే సూపర్ మామ్ చేపట్టాలని అధికారులతో చర్చలు జరుపుతున్నా. పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందనుకుంటున్నా. ఇలా చేస్తాం... ఒక్కో అనాథ ఆశ్రమంలో దాదాపు 60 మంది పిల్లలు ఉండొచ్చు. ఒక్కో పిల్లాడికి సూపర్ మామ్‌గా ఉండేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తాం. సామాజిక ఆలోచనతో ముందుకు వచ్చిన వారిని తీసుకొని ఒక్కో పిల్లాడితో అటాచ్ చేస్తాం. ఇలా వారు వీలున్నప్పుడుల్లా మాట్లాడుతూ వాళ్ల సమస్యలు తెలుసుకొని పరిష్కరించే ప్రయత్నం చేస్తాం. ప్రధానంగా ఎమోషనల్ సపోర్ట్ ఇస్తుంటాం. కెరీర్‌పై వాళ్లకు అవగాహన వచ్చే స్థాయి వరకు తీసుకువెళ్తాం. ఆ పిల్లలను ఎవరైనా దత్తత తీసుకునే వరకు అమ్మ లేని లోటు లేకుండా చేస్తాం. వారు భవిష్యత్‌లో పది మందికి సహయపడేలా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తాం. ఇలా చేయడం వల్ల ఆ చిన్నారులు ఉన్నత శిఖరాలను అధిరోహించే అవకాశాలుంటాయి. ఇప్పటివరకు ఈ పిల్లలను ఎవరూ పెద్దగా పట్టించుకోకపోవడం వల్ల.. కొందరు వాళ్ల బలహీనతలను ఉపయోగించుకొని నా అన్న ఫీలింగ్‌ను కలిగించి, సంఘ వ్యతిరేక శక్తులుగా మారుస్తున్నారు. అందుకే ఆ పిల్లల్లో సాఫ్ట్ ఫీలింగ్ కలిగించి మంచి భవిష్యత్‌కు సూపర్ మామ్ ద్వారా బాటలు వేయాలనుకుంటున్నాం. మదర్ నఫీసా... ముగ్గురు పిల్లల తల్లి నఫీసా. 2007లో మార్గ్ ఫౌండేషన్ ప్రారంభించి మహిళా సాధికారత దిశగా కృషి చేస్తున్న నఫీసాకు కర్మవీర్ పురస్కార్ దక్కింది. ఈమె పెద్దమ్మాయి సారా మెడిసిన్ చేయగా, కుమారుడు తాసిఫ్ ఢిల్లీలో సివిల్స్ ప్రిపేర్ అవుతున్నాడు. చిన్న అమ్మాయి సైబ లా ప్రిపేర్ అవుతోంది. ముగ్గురు బిడ్డలను సరైన మార్గంలో పెట్టిన నఫీసా.. ఇప్పుడు సమాజానికి ఉపయోగపడే సూపర్ మామ్‌గా మారుతున్నారు.