Baakiyalakshmi Actress Divya Ganesh Shared About The Physical Harassment While Traveling On Flight - Sakshi
Sakshi News home page

Divya Ganesh: ఫ్లైట్‌లో నా నడుము పట్టుకున్నాడు: బుల్లితెర నటి దివ్య గణేశ్

Published Wed, Apr 5 2023 2:02 PM | Last Updated on Wed, Apr 5 2023 2:57 PM

Actress Divya Ganesh Shared About The Physical Harassment In Flight - Sakshi

తమిళ నటి దివ్య గణేశ్ టాలీవుడ్‌కు అంతగా పరిచయం లేదు. తమిళంలో బుల్లితెర నటిగా గుర్తింపు తెచ్చుకుంది. తమిళనాడులోని చెన్నైకి చెందిన ఆమె సన్ టీవీలో ప్రసారమైన కేలాడి కన్మణి అనే సీరియల్‌తో తన నటనా జీవితాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత లక్ష్మీ వందచూ అనే సీరియల్‌లో ప్రధాన పాత్ర పోషించారు. కేవలం సీరియల్స్‌లోనే కాకుండా పలు సినిమాల్లో కూడా ఆమె నటించారు.

ప్రముఖ సీరియల్ సుమంగళిలో అను సంతోష్ పాత్ర ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. ఆమె 2019లో విడుదలైన అట్టు అనే తమిళ చిత్రంలో కూడా కనిపించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆమె తనకెదురైన చేదు అనుభవాలను పంచుకున్నారు. తాను కూడా లైంగిక వేధింపులకు గురైనట్లు వెల్లడించారు. 
 
దివ్య మాట్లాడుతూ.. 'నేను హైదరాబాద్‌ నుంచి చెన్నైకి ఫ్లైట్‌లో బయలుదేరా. అప్పుడు విమానంలో ప్రయాణికులు కొద్దిమందే ఉన్నారు. నేను చివర్లో కూర్చుని నిద్రపోతూ ఉన్నా. ఆ సమయంలో నా నడుము దగ్గర ఏదో తగులుతున్నట్లు అనిపించింది. మొదట నేను దాని గురించి నేను పట్టించుకోలేదు. పదే పదే అలా అవుతుంటే ఏంటా అని చూశా. నా వెనకాలే కూర్చున్న వ్యక్తి నడుమును తడుముతూ ఉన్నాడు. మొదట నేను ఏదైనా పురుగేమో అనుకున్నా. తర్వాత అసలు విషయం తెలిసి షాక్‌ తిన్నా. దీంతో వెంటనే పైకి లేచి అతడి చెంపపై చెల్లుమనిపించా.' అంటూ చెప్పుకొచ్చారు. 

ఎవరైనా సరే మహిళల పట్ల జరిగే వేధింపులకు అస్సలు భయపడకూడదన్నారు దివ్య గణేశ్. కాగా.. 2022లో దివ్య విజయ్ టీవీలో ప్రసారమయ్యే బాకియలక్ష్మి సీరియల్‌లో నటిస్తోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement