Director Sailesh Kolanu Shares Emotional Tweet About Dog Demise - Sakshi
Sakshi News home page

Sailesh Kolanu: నువ్వు లేకుండా ఆ సినిమాను ఊహించలేం.. డైరెక్టర్ ఎమోషనల్ ట్వీట్!

Published Fri, Jul 14 2023 11:07 AM | Last Updated on Fri, Jul 14 2023 11:41 AM

Tollywood Director Sailesh Kolanu Shares Emotional Tweet About Dog Demise - Sakshi

టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ శైలేష్ కొలను ప్రస్తుతం విక్టరీ వెంకటేశ్‌తో సైంధవ్‌ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. హిట్ మూవీ సిరీస్‌తో హిట్స్ కొట్టిన శైలేష్‌.. హిట్‌-3 కూడా నానితో తీసేందుకు ప్లానింగ్ చేస్తున్నాడు. అయితే తాజాగా హిట్‌ మూవీ డైరెక్టర్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.  కాగా.. విశ్వక్ సేన్‌తో తీసిన హిట్ పార్ట్-2, అడివి శేష్‌తో తీసిన హిట్-2 సూపర్ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. 

(ఇది చదవండి: నాగార్జున బ్లాక్ బస్టర్‌ మూవీ.. సైడ్‌ ఆర్టిస్ట్‌గా టాలీవుడ్ స్టార్ డైరెక్టర్!)

హిట్-2 సినిమాలో కనిపించిన డాగ్ చనిపోయిందని సోషల్ మీడియా వేదికగా తెలిపారు. ఆ చిత్రంలో హీరోను కాపాడే ఓ సీన్‌లో డాగ్ కనిపించింది. మూవీ ప్రమోషన్స్‌లోనూ డాగ్‌ కనిపించింది. ఒకరోజు ముందే శైలేష్ తన ఇన్‌స్టా స్టోరీస్‌లో ఈ విషయాన్ని తెలిపారు. డాగ్ మ్యాక్స్‌కు జ్వరం వచ్చిందని అందరూ తన కోసం ప్రార్థించడని కోరారు. అంతలోనే ఈ విషాదం నెలకొంది. మ్యాక్స్ మరణించిన విషయాన్ని షేర్ చేస్తూ ఎమోషనల్ అయ్యారు.

శైలేష్ తన ట్వీట్‌లో రాస్తూ..'బాధాతప్త హృదయంతో నేను ఈ వార్తను మీకు చెబుతున్నా. మాకు ఎంతో ప్రియమైన మాక్స్ ఇప్పుడే చనిపోయాడు. తాను గత పది రోజులుగా తీవ్రమైన టిక్ ఫీవర్‌తో బాధపడుతూ పోరాటం చేశాడు. నా జీవితంలో నేను కలుసుకున్న అత్యంత సున్నితమైన సోల్‌మేట్స్‌లో తాను  ఒకరు. మీ అందరి ప్రార్థనలకు ధన్యవాదాలు. ఆఫీసర్ మాక్స్ నిన్ను మిస్ అవుతున్నాం. మీరు లేకుండా హిట్‌-2 సినిమాను ఊహించుకోలేం.' అంటూ ఎమోషనల్ పోస్ట్ చేశారు.  

(ఇది చదవండి: మీరు అలా మాట్లాడుతుంటే సిగ్గేస్తోంది సార్: సీఎం తీరుపై సింగర్ ఫైర్)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement