సినీ నటి, వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా
సాక్షి, తిరుమల : నటి శ్రీదేవి మరణం సినీ లోకానికి తీరని లోటని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. శ్రీవారిని దర్శించుకునేందుకు రోజా తన కుటుంబసభ్యులతో కలిసి ఆదివారం ఉదయం తిరుమలకు చేరుకున్నారు. ఏడుకొండలవాడిని దర్శించుకున్న తర్వాత ఆమె విలేకరులతో మాట్లాడుతూ... శ్రీదేవిని ఆదర్శంగా తీసుకుని అనేకమంది సినిమాల్లో నటించటానికి వచ్చారని, అందులో తానూ ఒకరినని చెప్పారు. ఆమె ఆత్మ శాంతించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
చంద్రబాబు యూటర్న్
ప్రత్యేక హోదా ఉద్యమంలో ప్రజలందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు. ప్రత్యేక ప్యాకేజీ కోసం పాకులాడిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పుడు యూటర్న్ తీసుకున్నారని ఆరోపించారు. ప్రత్యేక హోదా రాకుంటే రాష్ర్ట నష్టం పోతుందని చంద్రబాబు ఇప్పుడు చెబుతున్నారని వ్యాఖ్యానించారు. కేసులకు భయపడేది వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కాదని.. తనపై బురద చల్లినా నిర్దోషిగా నిరూపించుకోవటానికి కోర్టులకు తిరుగుతున్నారని చెప్పారు. కానీ చంద్రబాబు నాయుడు ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా బుక్కైనా స్టేలు తెచ్చుకుని కోర్టులకు హాజరు కాకుండా తప్పించుకొని తిరుగుతున్నారని ధ్వజమెత్తారు.
Comments
Please login to add a commentAdd a comment