![A person From Jagityala demise in Saudi Due to Heart Attack - Sakshi](/styles/webp/s3/article_images/2022/02/23/444.jpg.webp?itok=hX5WrtaA)
పొట్టకూటి కోసం సౌదీకి వెళ్లిన జగిత్యాల వాసి గుండెపోటుతో అక్కడే మరణించాడు. ఇండియాకి తీసుకువచ్చేందుకు సాయం చేయాల్సిందిగా కుటుంబ సభ్యులు మంత్రి కేటీఆర్‌ను కోరారు. రెండు వారాలుగా మృతదేహం కోసం కుటుంబ సభ్యులు స్వగ్రామంలో ఎదురు చూస్తున్నారు.
జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం ఆరేపల్లి గ్రామానికి చెందిన పెండ్లి పోషయ్య అనే వ్యక్తి ఉపాధి కోసం సౌదీకి వెళ్లాడు. అక్కడ జెడ్డా సమీపంలో పని చేస్తున్నాడు. అయితే ఫిబ్రవరి 10న అప్రెల్ బాథెన్ దగ్గర ఉన్న సమయంలో అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో చనిపోయాడు. అప్పటి నుంచి అతని మృతదేహం సౌదీలోనే ఉండిపోయింది.
పెండ్లి పోషయ్య మృతదేహాన్ని ఇండియాకు తీసుకువచ్చేందుకు సహాకారం అందివ్వాల్సిందిగా మృతుడి తరఫున వారు మంత్రి కేటీఆర్‌ను ట్విట్టర్‌లో కోరారు. సౌదీలో ఉన్న ఇండియన్ ఎంబసీ అధికారులతో మాట్లాడి సాధ్యమైనంత త్వరగా సాయం అందిస్తామంటూ మంత్రి కేటీఆర్ బదులిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment