హాలీవుడ్ నటుడు చాడ్విక్ బోస్‌మ్యాన్ అకాలమరణం సినీలోకాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. అతని మరణం తీరని లోటంటూ పలువురు హాలీవుడ్ ప్రముఖులు, ఇతరులు తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. ముఖ్యంగా అమెరికా ఉపాధ్యక్ష పదవికి పోటీలో ఉన్న డొమొక్రాట్ అభ్యర్థి కమలా హారిస్ కూడా విచారం ప్రకటించారు. తెలివైన వాడు, మంచివాడు. తన స్నేహితుడు ఇంత చిన్న వయసులో ఈ లోకాన్ని వీడాడంటూ ట్వీట్ చేశారు. ఆయన కుటుంబానికి సానుభూతి ప్రకటించారు. (బ్లాక్ పాంథర్ నటుడు కన్నుమూత)
చాడ్విక్ బోస్‌మ్యాన్ పెద్దప్రేగు క్యాన్సర్‌తో శుక్రవారం తుది శ్వాస విడిచారు. కాలిఫోర్నియాలో జరిగిన ఫ్రీడమ్ ఫర్ ఇమ్మిగ్రెంట్స్ కార్యక్రమంలో కమలా హారిస్‌కు మద్దతుగా నిలిచారు. ముఖ్యంగా అమెరికా వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థిగా కమలాను జో బైడెన్ ప్రతిపాదించిన అనంతరం కమలాతో కలిసి ఉన్న ఫోటోను ట్విటర్ లో షేర్ చేశారు. అదే అతని ఆఖరి ట్వీట్ కావడం విషాదం. దీంతో కమలా హారిస్ చాడ్విక్ మరణంపై విచారం వ్యక్తం చేశారు. కాగా బ్లాక్ పాంథర్ మార్వెల్ పాత్రతో పాపులర్ అయిన జాకీ రాబిన్సన్ పాత్రతోపాటు అనేక పాత్రల్లో అద్భుతమైన నటనతో మెప్పించారు.
YES @KamalaHarris! 👏🏾👏🏾👏🏾#WhenWeAllVote #Vote2020 pic.twitter.com/iOU3duBAcA
— Chadwick Boseman (@chadwickboseman) August 11, 2020
Heartbroken. My friend and fellow Bison Chadwick Boseman was brilliant, kind, learned, and humble. He left too early but his life made a difference. Sending my sincere condolences to his family. pic.twitter.com/C5xGkUi9oZ
— Kamala Harris (@KamalaHarris) August 29, 2020
Comments
Please login to add a commentAdd a comment