గుండె పగిలింది: విషాదంలో పూజా హెగ్డే  | Tollywood Actress Puja Hegde mourns her teacher demise | Sakshi
Sakshi News home page

గుండె పగిలింది: విషాదంలో పూజా హెగ్డే 

Apr 22 2021 4:58 PM | Updated on Apr 22 2021 7:18 PM

Tollywood Actress Puja Hegde mourns her teacher demise - Sakshi

హీరోయిన్ పూజా తీవ్ర విషాదంలో మునిగిపోయారు. తన ఫేవరెట్ టీచర్ శ్రీమతి జెసికా దరువాలా ఇక లేరనే వార్తతో తన గుండె పగిలిపోయిందంటూ  సోషల్‌ మీడియాలో ఆవేదన వ్యక్తం చేశారు.

సాక్షి, హైదరాబాద్‌ : టాలీవుడ్‌ టాప్‌ హీరోయిన్ పూజా హెగ్డే  టీచర్ మరణవార్తతో  తీవ్ర విషాదంలో మునిగిపోయారు. తన ఫేవరెట్ టీచర్ శ్రీమతి జెసికా దరువాలా ఇక లేరనే  వార్తతో తన గుండె పగిలి పోయిందంటూ సోషల్‌ మీడియాలో ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషాదాన్ని తట్టుకోలేకపోతున్నానంటూ ఇన్‌స్టాలో తన  బాధను షేర్‌ చేసుకున్నారు. ఢిల్లీలోని మానెక్‌జీ కూపర్ స్కూల్‌లో చదివి ఉంటే ఇతరులకు  కూడా తన టీచర్‌ గురించి తెలుసుకునే అదృష్టం దక్కేదని పేర్కొన్నారు.

ఈ ప్రపంచం ఒక రత్నాన్ని కోల్పోయిందంటూ సంతాపం ప్రకటించారు పూజా. తాను నిరాశపడిన ప్రతీసారి ఆమె తనకు ఎంతో  ధైర్యం చెప్పేవారని ఆమె ధైర్యవచనాలు ఎప్పటికీ తనతోనే ఉంటాయంటూ భావోద్వేగానికి గురయ్యారు. నిజంగా కొంతమంది టీచర్లు ప్యూర్ గోల్డ్ అంటూ తన జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. తన ఉన్నతికి కారణమైన అంతటి గొప్ప టీచర్ మాటలను ఎప్పుడూ మరిచిపోలేను.. జెసికా జియోగ్రఫీ టీచర్ అయినా ఎన్నో జీవిత పాఠాలను  నేర్పించారన్నారు. ఈ సందర్భంగా టీచర్‌ కుటుంబ సభ్యులకు పూజా తన  ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు.

చదవండి: ఎన్నిసార్లు గెలుస్తావ్‌ భయ్యా..! నెటిజన్లు ఫిదా
జొమాటో కొత్త  ఫీచర్‌, దయచేసి మిస్‌ యూజ్‌ చేయకండి!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement