న్యూజెర్సీలో తెలంగాణ ఉద్యమ నేత కడియం రాజుకు ఘనంగా నివాళులు | ABVP Kadiyam Raju Condolence Meeting New Jersey USA - Sakshi
Sakshi News home page

న్యూజెర్సీలో తెలంగాణ ఉద్యమ నేత కడియం రాజుకు ఘనంగా నివాళులు

Published Thu, Sep 14 2023 5:49 PM | Last Updated on Thu, Sep 14 2023 6:21 PM

ABVP Kadiyam Raju Condolences Meeting New Jersey USA - Sakshi

అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) ఆధ్వర్యంలో ఏబీవీపీ పూర్వ జాతీయ కార్యదర్శి, తెలంగాణ ఉద్యమకారుడు, ఉస్మానియా యూనివర్సిటీ ముద్దుబిడ్డ డాక్ట‌ర్ కడియం రాజు గారి శ్రద్ధాంజలి సభ అమెరికాలో న్యూజెర్సీ రాష్ట్రంలో ఏబీవీపీ పూర్వ కార్యకర్తల మీటింగ్ నిర్వహించడం జరిగింది. ఈ శ్రద్ధాంజలి కార్యక్రమానికి బండి సంజయ్ తోపాటు, ఏబీవీపీ పూర్వ విద్యార్థులు విలాస్ జంబుల, అమర్ జునూతుల, సంతోష్ మైకా, రాజేష్ రెడ్డి, సమరసింహా రెడ్డి బొక్క, కిరణ్, మధుసుధన్ రెడ్డి, ప్రదీప్ కట్ట, సుధీర్ గుత్తికొండ , సురేష్ సోమిశెట్టి, ప్రీతం , ప్రేమ్ కాట్రగడ్డ, పూర్వ కార్యకర్తలు, వివిధ విద్యార్థి సంఘాల నాయకులు, స్వర్గీయ డా కడియం రాజన్న ఆత్మీయ మిత్రులు పెద్ద ఎత్తున హాజరై కడియం రాజన్న గారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది.

బండి సంజయ్ కూడా గతంలో అఖిల్ భారతీయ విద్యార్థి పరిషత్లో పట్టణ కన్వీనర్, పట్టణ ఉపాధ్యక్షునిగా, రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా పని చేశారు. ఉస్మానియా పూర్వ విద్యార్థి, అఖిల భారతీయ విద్యార్థి ఫెడరేషన్ నాయకుడు ,తన ఉద్యమాల ద్వారా ఎందరికో ఆదర్శంగా నిలిచిన జాతీయ స్థాయి లీడర్, కడియం రాజు మాకు (విలాస్ రెడ్డి జంబుల, శ్రీకాంత్ తుమ్మల ) సహచరుడు కావడం మా పూర్వ జన్మ సుకృతం. విలాస్ రెడ్డి జంబుల అనే వ్యక్తి ఈ రోజు అమెరికాలో ఉన్నత స్థాయిలో ఉన్నాడు అంటే దానికి కారణం మనం అందరం ముద్దుగా పిలుచుకునే ఉస్మానియా దిక్సూచి కడియం రాజు అని సగర్వంగా చెబుతాను.

ఒక సిద్ధాంతం కోసం , తనని నమ్ముకున్న వారి కోసం కుటుంబాన్ని సైతం పక్కన పెట్టైనా పోరాడే యోధుడితో కలిసి చదివే అవకాశం వచ్చినందుకు, ఆయనతో కలిసి పనిచేసే అవకాశం వచ్చినందుకు ఎప్పుడూ గర్వంగా ఉంటుంది. దేశ భక్తి , సేవాభావం ,ఉద్యమస్ఫూర్తి ,నాయకత్వ లక్షణాలు, పోరాడేతత్వం ఇవన్నీ కలగలిపిన ఆదర్శ వ్యక్తి కడియం రాజు. అసలు ఎవరు ఈ "రారాజు", అయన గురించి, ప్రజలను చైతన్య పరిచిన అయన విధానాలు గురించి, ఒక్క మాటలో చెప్పాలంటే అయన ప్రయాణం గురించి మా మాటల్లో.....,కాదు కాదు ,మాలాగా అభిమానించే ఎంతోమంది కోసం ఆయన ప్రయాణం గురించి వారి మాటల్లో

దేశాన్ని ప్రేమించే జాతీయ భావాలు కలిగిన విద్యార్థి..
ఉస్మానియా క్యాంపస్‌లో ఉద‌యించిన‌ ఉద్యమ నేత..
స‌మాజాన్ని ప్రేమించే న‌వ‌త‌రం నాయ‌కుడు..
ఎంతో భ‌విష్య‌త్ ఉన్న ఆ డైన‌మిక్ లీడ‌ర్‌ను విధి కాటేసింది..
స‌మాజం చిన్న‌బోయేలా ఒక నాయ‌కుడిని కోల్పోయింది..
ప్ర‌జ‌ల కోసం ఆయ‌న చేసిన‌ ఉద్య‌మాల‌ను ఆయ‌న ఆద‌ర్శ వ్య‌క్తిత్వం గుర్తు తెచ్చుకుని త‌ల్ల‌డిల్లుతున్నారు ఎంతో మంది..

ఏబీవీపీ ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమ చరిత్రలో 108 రోజుల జైలు జీవితం గడిపి, అన్న, బాబాయ్, మామగా విద్యార్థులచే ముద్దుగా పిలుచుకునే ఉస్మానియా యూనివర్సిటీ దిక్సూచి డాక్ట‌ర్ కడియం రాజు ఇటీవ‌ల‌ మార్చి 20న అనారోగ్యంతో క‌న్నుమూశారు. ఆయన నల్లగొండ జిల్లాలోని కొత్తగూడెం గ్రామంలో నిరుపేద దళిత కుటుంబంలో జన్మించారు. తన పాఠశాల విద్య కొండ్రపోల్ గ్రామంలో, ఇంటర్ నాగార్జున జూనియర్ కళాశాల, మిర్యాలగూడ కేఎన్ఎం డిగ్రీ కళాశాలలో బీఏ డిగ్రీ పూర్తిచేశారు. పేదరికం వెక్కిరిస్తున్నా ఆ తర్వాత ఎంఏ హిస్టరీ విభాగంలో ఎంఫిల్, పీహెచ్‌డీ ఉస్మానియా యూనివర్సిటీలో పూర్తిచేశారు. ఆయనకు ఇంటర్ నుంచే దేశభక్తి, జాతీయ భావాలు కలిగిన విద్యార్థిగా ఏబీవీపీలో క్రియాశీలకంగా పనిచేస్తూ డిగ్రీలో కళాశాల ఎబీవీపీ అధ్యక్షులుగా ఎన్నికయ్యారు.

2002 సంవత్సరం నుండి ఏబీవీపీ ఉస్మానియా యూనివర్సిటీ సైద్ధాంతిక పోరులో ముందుండి క్రియాశీలకంగా పనిచేశారు. ఏబీవీపీ చేపట్టిన ఎన్నో విద్యారంగ సమస్యలపై ముందుండి పోరాడి, ఎన్నో లాఠీ దెబ్బలు, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగి 108 రోజులు జైలు పాలయ్యారు. కుట్ర‌ల‌ను, అవినీతిని స‌హించ‌ని వ్య‌క్తిత్వం ఆయ‌న‌ది. ఏబీవీపీ చేపట్టిన ఉస్మానియా యూనివర్సిటీ భూముల పరిరక్షణ ఉద్యమంలో ముందుండి, అనేక ఆక్రమణ భూముల విషయంలో కోర్టులలో కేసులు వేశారు, నిరుద్యోగం, విద్యారంగ సమస్యలు మెస్‌ బిల్లులు, స్కాలర్‌షిప్పులు, మౌలిక వసతులు, నూతన హాస్టళ్ల నిర్మాణం కోసం పలు ఉద్యమాలకు నాయకత్వం వహించారు.

ఏబీవీపీలో డాక్ట‌ర్ కడియం రాజు తన సుదీర్ఘ ప్రయాణంలో ఉస్మానియా యూనివర్సిటీ ఇంచార్జ్‌గా, సిటీ సెక్రెటరీగా, స్టేట్ సెక్రెటరీగా, నేషనల్ సెక్రెటరీగా, సెంట్రల్ వర్కింగ్ కమిటీ సభ్యులుగా అనేక విద్యార్థి ఉద్యమాలకు నేతృత్వం వహించారు. అలాగే జాతీయ ఎస్సీ, ఎస్టీ దివ్యాంగుల విద్యా నియంత్రణ కమిటీ సభ్యులుగా బాధ్యతలు నిర్వర్తించారు. అలాగే తెలంగాణ ఉద్యమంలో సైతం ఏబీవీపీ చేపట్టిన అనేక ఉద్యమాలను ముందుండి నడిపించారు.

ఏబీవీపీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన లక్ష మందితో ‘తెలంగాణ రణభేరి’లో సుష్మాస్వరాజ్ ఆహ్వానించిన సభకు సభాధ్యక్షత వహించారు. అలాగే ఏబీవీపీ తెలంగాణ సాధనకై మహా పాదయాత్రలో కోదాడ నుండి హైదరాబాద్ వరకు నేతృత్వం వహించారు. నా రక్తం- నా తెలంగాణ, మిలియన్ మార్చ్, సకల జనుల సమ్మె, సాగరహారం, ఉస్మానియా యూనివర్సిటీ‌లో విద్యార్థుల నిరాహార దీక్షలు... ఇలా తెలంగాణ సాధనలో అనేక ఉద్యమాలలో క్రియాశీలకంగా పోరాడారు. జాతీయ భావాలు కలిగిన దేశభక్తుడిగా ఎంతోమంది విద్యార్థులను తీర్చిదిద్దిన డాక్ట‌ర్ కడియం రాజు మరణం విద్యార్థి లోకానికి, దేశానికి తీరని లోటు. ఆయ‌న భౌతికంగా మ‌న మ‌ధ్య లేక‌పోయినా ప్ర‌జ‌ల కోసం ఆయ‌న చేసిన‌ ఉద్య‌మాల‌ను ఆయ‌న వ్య‌క్తిత్వం అంద‌రికీ ఆద‌ర్శం, మ‌రెంతో మందికి స్పూర్తి.

(చదవండి: అమెరికాలో తెలుగు భాషకున్న స్థానం అంత ఇంత కాదు!: డా ప్రసాద్‌ తోటకూర)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement