రాయపాటికి పలువురి పరామర్శ | Rayapati`s wife expire.. Condolense | Sakshi

రాయపాటికి పలువురి పరామర్శ

Published Wed, Jul 20 2016 8:33 PM | Last Updated on Mon, Sep 4 2017 5:29 AM

Rayapati`s wife expire.. Condolense

నగరంపాలెం (గుంటూరు) : నర్సరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావును బుధవారం రాష్ట్ర హోం మంత్రి, ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చిన రాజప్ప పరామర్శించారు. లక్ష్మీపురంలోని ఎంపీ నివాసంలో రాయపాటి సతీమణి లీలాకుమారి చిత్రపటానికి పూల మాల వేసి నివాళులర్పించారు. అలాగే, నర్సరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ, కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి, చైతన్య కళాశాల డైరెక్టర్‌ బీఎస్‌ రావు, శాసనసభ విప్‌ చింతమనేని ప్రభాకర్, జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ చెరుకూరి శ్రీధర్, ఇంటెలిజెన్స్‌ అదనపు డీజీ ఏబీ వెంకటేశ్వరరావు, నగర ఎస్పీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి తదితరులు రాయపాటిని పరామర్శించిన వారిలో ఉన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
Advertisement