ఉమ్మడి ప్రవేశాలకు అందుబాటులో సీట్లు
- ఎన్‌ఐటీ, ట్రిపుల్ ఐటీ, ఐఐటీలలో ఒకేసారి ప్రవేశాలు
- ఇందుకు జాయింట్ అలొకేషన్ అథారిటీ ఏర్పాటు
- ఏపీకి ప్రకటించని ఎన్‌ఐటీ సీట్ల వివరాలు
సాక్షి, హైదరాబాద్: ఎన్‌ఐటీ, ట్రిపుల్ ఐటీ, ఐఐటీలు అన్నింటిలో ఒకేసారి ప్రవేశాలు చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీని ఏర్పాటు చేసింది. దీని ఆధ్వర్యంలోనే ప్రవేశాలు చేపట్టనుంది. ఎన్‌ఐటీ సీట్ల విషయంలో అన్ని రాష్ట్రాలకు చెందిన సీట్ల వివరాలను అందుబాటులో ఉంచినా ఇటీవల ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన ఎన్‌ఐటీని, అందులోని సీట్ల వివరాలను మాత్రం పొందుపరచలేదు. సీట్ల కేటాయింపు అథారిటీ ప్రకటించిన వివరాల ప్రకారం ఐఐటీల్లో 10,006 సీట్లు, ఎన్‌ఐటీల్లో 17,390 సీట్లు, ట్రిపుల్‌ఐటీల్లో 2,228 (చిత్తూరుకు 130, కర్నూలుకు 50 సీట్లు) సీట్లు ఉన్నట్లు పేర్కొంది. వీటితోపాటు కేంద్ర ఆర్థిక సహకారంతో కొనసాగే ప్రైవేటు సంస్థల్లో 3,741 సీట్లను ఈ ఉమ్మడి ప్రవేశాల కౌన్సెలింగ్ ద్వారా ప్రవేశాలు చేపట్టనుంది.
ఇదీ ప్రవేశాల షెడ్యూలు
జూన్ 18: జేఈఈ అడ్వాన్స్‌డ్ ఆలిండియా ర్యాంకుల ప్రకటన
జూన్ 24: జేఈఈ మెయిన్ ఆలిండియా ర్యాంకులు
జూన్ 25- 29: విద్యార్థులు కాలేజీలను ఎంచుకునేందుకు ఆప్షన్లు (ఛాయిస్).
జూన్ 28: విద్యార్థుల చాయిస్‌ను బట్టి మాక్ సీట్ అలొకేషన్ ప్రదర్శన.
జూన్ 30: ఐఐటీ/ఎన్‌ఐటీల్లో సీట్ల కేటాయింపు, పరిశీలన.
జూలై 1: మొదటి దశ సీట్ల కేటాయింపు ప్రకటన.
జూలై 2-6: విద్యార్థుల నుంచి అంగీకారం తీసుకోవడం.
జూలై 7: భర్తీ అయిన సీట్లు, మిగిలిన సీట్ల ప్రకటన.
జూలై 7: రెండో దశ సీట్ల కేటాయింపు.
జూలై 8-11: విద్యార్థుల అంగీకారం తీసుకోవడం.
జూలై 12: భర్తీ అయిన సీట్లు, మిగిలిన సీట్ల వివరాల ప్రకటన.
జూలై 12: మూడో దశ సీట్లు కేటాయింపు.
జూలై 13-15: విద్యార్థుల అంగీకారం తీసుకోవడం.
జూలై 16: ఐఐటీల్లో తరగతులు ప్రారంభం.
జూలై 16: భర్తీ అయిన, మిగిలిన సీట్ల వివరాలు ప్రకటన.
జూలై 16: నాలుగో దశ సీట్ల కేటాయింపు
జూలై 17-20: విద్యార్థుల నుంచి అంగీకారం తీసుకోవడం.
23 నుంచి: ఎన్‌ఐటీలు, ట్రిపుల్ ఐటీల్లో తరగతులు ప్రారంభం.
ఇవీ ఐఐటీల వారీగా తాజా సీట్లు..
భువనేశ్వర్ (180), ముంబై (903), మండీ (145), ఢిల్లీ (851), ఇండోర్ (120), ఖరగ్‌పూర్ (1341), హైదరాబాద్ (220), జోథ్‌పూర్ (120), కాన్పూర్ (853), చెన్నై (838), గాంధీనగర్ (150), పట్నా (200), రూర్కీ (1030), ధన్‌బాద్ (935), రోపార్ (130), వారణాసి(బీహెచ్‌యూ) (1090), గువాహటి (660), పలక్కడ్(120), తిరుపతి (120)- మొత్తం (10,006)