సాక్షి, హైదరాబాద్: ఎన్‌ఐటీ, ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాల కోసం ఏప్రిల్ 3న నిర్వహించనున్న జేఈఈ మెయిన్‌కు వచ్చే నెల 1వ తేదీ నుంచి ప్రారంభించనున్న ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియను జేఈఈ మెయిన్ వెబ్‌సైట్‌లో సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) పొందుపరించింది. అడ్మిషన్ నోటీసులో వివరాలను వెల్లడించింది. అభ్యర్థులు జాగ్రత్తగా వాటిని అనుసరిస్తూ దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.
అభ్యర్థులు అనుసరించాల్సిన ప్రక్రియ
* ముందుగా ఇన్ఫర్మేషన్ బులెటిన్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. అందులోని అంశాల ప్రకారం అన్ని అర్హతలు ఉన్నాయా లేదా చూసుకోవాలి.
* ఆన్‌లైన్ దరఖాస్తుల ఫార్మాట్‌లోని అన్ని అంశాలను ముందుగా చూసుకోవాలి. అవసరమైన అన్ని డాక్యుమెంట్లు, సమాచారాన్ని అందుబాటులో ఉంచుకోవాలి.
* స్కాన్ చేసిన ఫొటో కాపీలు, స్కాన్ చేసిన సంతకం కాపీ, ఎడమ చేతి బొటన వేలి ముద్రను స్కాన్ చేసిన కాపీలను జేపీఈజీ ఫార్మాట్‌లో అందుబాటులో ఉంచుకోవాలి. ఆ తరువాత ఆన్‌లైన్‌లో దరఖాస్తును పూర్తి చేయాలి. ఫొటో, సంతకం, ఎడమ చేతి బొటన వేలి ముద్ర కాపీలను అప్‌లోడ్ చేయాలి.
* ఆ తరువాత పరీక్ష ఫీజును క్రెడిట్/డెబిట్ కార్డు ఉపయోగించి చెల్లించాలి. లేదా ఈ-చలానా జనరేట్ చేసుకొని, ఫీజు చెల్లించాక ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
* అక్నాలెడ్జ్ స్లిప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. ప్రతి విద్యార్థి తన మొబైల్ నంబర్, ఈ-మెయిల్ ఐడీని ఆన్‌లైన్ దరఖాస్తు ఫారంలో కచ్చితంగా పొందుపరుచాలి.
వెబ్‌లో జేఈఈ దరఖాస్తుల విధానం
Published Fri, Nov 20 2015 2:17 AM | Last Updated on Sun, Sep 3 2017 12:43 PM
Advertisement