Online admissions process
-
హెచ్‌సీయూ అడ్మిషన్ల ప్రక్రియ షురూ
రాయదుర్గం: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ 2020–21 విద్యా సంవత్సరం అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. అడ్మిషన్ కోసం దరఖాస్తులను మే 3వ తేదీలోగా ఆన్లైన్ లోనే దరఖాస్తు చేసుకోవాలి. హెచ్‌సీయూలో 2,400 సీట్లు వివిధ కోర్సులలో ఉన్నాయి. మొత్తం 128 కోర్సులలో 16 ఇంటిగ్రేటెడ్ కోర్సులు, 41 పొస్టు గ్రాడ్యుయేట్ కోర్సులు, 15 ఎంఫిల్,10 ఎంటెక్, 46 పీహెచ్డీ కోర్సులు ఉన్నాయి. గతేడాది మొత్తం 119 కోర్సులలో 2,170 సీట్లు ఉండేవి. ఈ ఏడాది నుంచి కొత్తగా 17 కోర్సులు...182 సీట్లు హెచ్‌సీయూలో 2020–21 విద్యా సంవత్సరం నుంచి కొత్తగా 17 కోర్సులు ప్రారంభిస్తుండగా వాటిలో 182 సీట్లు ఏర్పాటు చేశారు. అందులో ఎంఈడీ ఎడ్యుకేషన్ లో 50 సీట్లు, ఎంఏ జెండర్‌స్టడీస్–20, ఎంఏ కమ్యూనికేషన్ (మీడియాస్టడీస్) 25, ఎంఏ కమ్యూనికేషన్ (మీడియా ప్రాక్టీస్)–25, ఎంటెక్ మైక్రో ఎలక్ట్రానిక్స్ అండ్ వీఎల్ఎస్ఐ డిజైనింగ్–06, ఎంటెక్ మ్యానుఫాక్చరింగ్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్–18, పీహెచ్డీ మైక్రోబయాలజీ–04 (పునః ప్రారంభిస్తున్నారు), ఎంఫిల్ కంప్యూటర్ లిటరేచర్–08, ఎంఫిల్ సోషల్ ఎక్స్క్లూషన్ అండ్ ఇన్ క్లూజన్ పాలసీ–04, ఎంఫిల్ రీజనల్ స్టడీస్–04, పీహెచ్డీ థియేటర్ ఆర్ట్స్, కంపారిటివ్ లిటరేచర్, ఇంగ్లిష్ లాంగ్వేజ్ స్టడీస్‌లో నాలుగేసి సీట్లు, రీజినల్ స్టడీస్, కాంగ్ని టివ్సైన్స్లలో రెండేసి సీట్లు, ఫోక్ కల్చర్ స్టడీస్, సోషల్ ఎక్స్‌క్లూజివ్ అండ్ ఇన్ క్లూజివ్ పాలసీలో ఒక్కో సీటును కొత్తగా ఏర్పాటు చేశారు మరిన్ని కోర్సులలో అడ్మిషన్లు ఇలా.. ఎంసీఏలో అడ్మిషన్‌ను నిట్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఎన్ఐఎంసెట్ స్కోరు ద్వారా కేటాయిస్తారు. ఎంటెక్ కోర్సులో సీటును గేట్ ద్వారా సీసీఎంటీ లో ప్రతిభ చాటిన వారికి కేటాయిస్తారు. అయిదేళ్ళ ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ (కంప్యూటర్ సైన్స్)లో సీటును సెంట్రల్ సీట్ అలోకేషన్ బోర్డు (సీఎస్ఏబి) జేఈఈ ద్వారా కేటాయిస్తారు. ఎంబీఏ సీటును క్యాట్, ఎంఎస్సీ బయోటెక్నాలజీలో సీటును న్యూఢిల్లీ లోని జేఎన్ యూ ద్వారా నిర్వహించే సీఈఈబీలో ప్రతిభ చాటిన వారికి కేటాయిస్తారు. మరిన్ని వివరాలకు వెబ్సైట్ http://acad.uohyd.ac.inను లాగిన్ కావాలి. -
పాస్వర్డ్ పరేషాన్!
‘కరీంనగర్‌కు చెందిన ఓ విద్యార్థి డిగ్రీలో చేరేందుకు తల్లిదండ్రులతో కలిసి ఒక ప్రైవేట్ కళాశాలకు మొదటి దశలో సర్టిఫికెట్లు అప్పగించారు. సదరు కళాశాలకు చెందిన వారు తమ కళాశాలకు సంబంధించిన ఫోన్ నంబర్, దానికి వచ్చే పాస్వర్డ్ ఆధారంగా మొదటి దశలో నమోదు చేసి కేవలం తమ కళాశాలలోనే ఆప్షన్ ఇవ్వగా, అందులోనే సీటు వచ్చింది. ఇప్పుడు విద్యార్థి స్నేహితులకు వేరే కళాశాలల్లో సీటు రాగా మారాలని ఆలోచన ఉంది. మారుదామంటే కళాశాల ఫోన్ నంబర్ ఇచ్చి ప్రవేశాలు నమోదు చేశారు. ఇప్పుడు రెండో దశలో మారాలంటే ఫోన్ నంబర్ తప్పనిసరి. ఈ విషయమై కళాశాలల వారిని అడుగగా ఇచ్చేది లేదని తేల్చి చెప్పేశారు’ ఇది శాతవాహన యూనివర్సిటీ పరిధిలో పలు ప్రైవేట్ డిగ్రీ కళాశాలల యాజమాన్యాలు ఇలాగే కళాశాల నంబర్లు ఇచ్చి విద్యుర్థులు ఎటూ వెళ్లకుండా చేస్తున్నారు. – శాతవాహనయూనివర్సిటీ: డిగ్రీ మొదటి దశలో పలు ప్రైవేట్ కళాశాలలు ఒడిగట్టిన అక్రమాలకు విద్యార్థులు బలవుతున్నారు. వివిధ అఫర్ల పేరుతో నమ్మబలికి మొదటి దశలో పలు కళాశాలలకు సంబంధించిన వ్యక్తులవే ఫోన్ నంబర్లు ఇచ్చి వాటికి వచ్చిన ఓటీపీలతోనే ప్రవేశాల నమోదు చేశారు. తమ కళాశాలల్లోనే సీట్లు వచ్చేలా అప్షన్లు ఇచ్చారు. ఫలితంగా వారుకోరుకున్నట్టే వారి కళాశాలల్లోనే సీట్లు పొందారు. కానీ మొదటి దశ సీట్ల కేటాయింపు పక్రియ ముగిసి రెండో దశ కౌన్సిలింగ్‌కు నేటి(సోమవారం) వరకు అవకాశముంది. రెండో దశలో కళాశాల మార్చుకుందామనే ఆలోచన ఉన్న విద్యార్థులకు పలు ప్రైవేట్ కళాశాల వారి నంబర్లే ఇవ్వడంతో మార్చుకునే అవకాశం లేకుండా పోయింది. డిగ్రీ ప్రవేశాల నమోదులో ఫోన్ నంబరే కీలకం కావడంతో కళాశాల మార్చేందుకు ఆప్షన్లు పెట్టుకుందామనే వారికి పలు ప్రైవేట్ కళాశాలలు ఫోన్ నంబర్ ఇవ్వడం లేదు. కొందరు విద్యార్థుల తల్లిదండ్రులు పలు కళాశాలలు ఇచ్చిన ఆఫర్లకు ఆకర్షితులై వారి పిల్లలకు కూడా తెలియకుండా వారి ప్రవేశాలు ప్రైవేట్ కళాశాలల్లో తీసుకున్నారు. వారికి మారుదామనే ఆలోచన ఉన్నా ప్రవేశాల సమయంలో కళాశాలల నంబర్లు ఇవ్వడం, మారడం ఎందుకనే తల్లిదండ్రుల బలవంతంతో అదే కళాశాలల్లో మగ్గుతున్నారు. బహుమానాలు.. బంఫర్ ఆఫర్లు డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు ప్రస్తుతం రెండో దశ కొనసాగుతుంది. మొదటి దశ సీట్లు కేటాయించగా నేటితో రెండోదశ నమోదు, వెబ్ఆప్షన్లు, సెల్ఫ్ రిపోర్టింగ్ గడువు ముగుస్తుంది. ఇది ఇలా ఉండగా తమ కళాశాలలో సీట్లు నింపుకునేందుకు ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా బంపర్ ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ఒకరు ప్రవేశానికి మొబైల్ ఫోన్ ఉచితంగా ఇవ్వడం, మరో కళాశాల ఏకంగా ల్యాప్‌టాప్ ఇస్తామని, మరికొన్ని కళాశాలలు రవాణా ఫీజు, పరీక్ష ఫీజుతోపాటు అన్ని ఫీజులు ఉచితమేనని, ఇంకొన్ని కళాశాలలు ఒక అడుగు ముందుకు వేసి అన్ని ఫీజులు ఉచితంతోపాటు తిరిగి విద్యార్థులకు నగదు ఇస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. కొన్ని కళాశాలల యాజమాన్యాలు డిగ్రీ ప్రవేశాల పక్రియలో తీవ్రమైన అనారోగ్యకరమైన పోటీతో దిగజారుడుతనం ప్రదర్శిస్తున్నాయి. ఎలాగో సీట్లు నింపుకుని ప్రభుత్వం నుంచి వచ్చే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను కొల్లగొడుదామనే ఆలోచనతో ప్రవేశాలు కొనసాగిస్తున్నాయి. దీనికితోడు తమ లెక్చరర్లలో కాన్వాసింగ్ చేపించి అడ్మిషన్‌కు కొంత మొత్తం చొప్పున చెల్లిస్తున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ఏది ఏమైనా తల్లిదండ్రలు మాత్రం విద్యా నాణ్యత ప్రమాణాలు పాటించే కళాశాలల్లోనే విద్యార్థులను చేర్చాలని విద్యారంగ నిపుణులు కోరుతున్నారు. ప్రైవేట్ కళాశాలల అక్రమాల విషయంపై శాతవాహన రిజిస్ట్రార్ ప్రొఫెసర్ యూ.ఉమేశ్‌కుమార్‌ను సంప్రదించగా ప్రైవేట్ కళాశాలలు ప్రవేశాల విషయంలో ప్రలోభాలు, ఇబ్బందులు పెడితే తమ దృష్టికి తీసుకురావాలని సూచిస్తున్నారు. -
వెబ్‌లో జేఈఈ దరఖాస్తుల విధానం
సాక్షి, హైదరాబాద్: ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాల కోసం ఏప్రిల్ 3న నిర్వహించనున్న జేఈఈ మెయిన్‌కు వచ్చే నెల 1వ తేదీ నుంచి ప్రారంభించనున్న ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియను జేఈఈ మెయిన్ వెబ్సైట్లో సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) పొందుపరించింది. అడ్మిషన్ నోటీసులో వివరాలను వెల్లడించింది. అభ్యర్థులు జాగ్రత్తగా వాటిని అనుసరిస్తూ దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. అభ్యర్థులు అనుసరించాల్సిన ప్రక్రియ * ముందుగా ఇన్ఫర్మేషన్ బులెటిన్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి. అందులోని అంశాల ప్రకారం అన్ని అర్హతలు ఉన్నాయా లేదా చూసుకోవాలి. * ఆన్లైన్ దరఖాస్తుల ఫార్మాట్లోని అన్ని అంశాలను ముందుగా చూసుకోవాలి. అవసరమైన అన్ని డాక్యుమెంట్లు, సమాచారాన్ని అందుబాటులో ఉంచుకోవాలి. * స్కాన్ చేసిన ఫొటో కాపీలు, స్కాన్ చేసిన సంతకం కాపీ, ఎడమ చేతి బొటన వేలి ముద్రను స్కాన్ చేసిన కాపీలను జేపీఈజీ ఫార్మాట్లో అందుబాటులో ఉంచుకోవాలి. ఆ తరువాత ఆన్లైన్లో దరఖాస్తును పూర్తి చేయాలి. ఫొటో, సంతకం, ఎడమ చేతి బొటన వేలి ముద్ర కాపీలను అప్లోడ్ చేయాలి. * ఆ తరువాత పరీక్ష ఫీజును క్రెడిట్/డెబిట్ కార్డు ఉపయోగించి చెల్లించాలి. లేదా ఈ-చలానా జనరేట్ చేసుకొని, ఫీజు చెల్లించాక ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. * అక్నాలెడ్జ్ స్లిప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి. ప్రతి విద్యార్థి తన మొబైల్ నంబర్, ఈ-మెయిల్ ఐడీని ఆన్లైన్ దరఖాస్తు ఫారంలో కచ్చితంగా పొందుపరుచాలి.