
19 నుంచి ఐఐటీల్లో తరగతులు!
ఒక్కో ఐఐటీలో ఒక్కోలా షెడ్యూలు
ఎన్‌ఐటీల్లో 16 నుంచి తరగతులు
సాక్షి, హైదరాబాద్: దేశ్యాప్తంగా ఉన్న ఐఐటీల్లో ఈ నెల 19 నుంచి తరగతులు ప్రారంభించేం దుకు ఐఐటీ కౌన్సిల్ నిర్ణయించింది. ఐఐటీల వారీగా తరగతుల ప్రారంభ తేదీలను ప్రకటిం చింది. ఐఐటీ ఢిల్లీలో ఈ నెల 19 నుంచి తరగతులు ప్రారంభంకానున్నాయి. ఆ తర్వాత ఒక్కో ఐఐటీలో ఒక్కో తేదీ ఖరారు చేసింది. ఎన్‌ఐటీల్లోనూ ఈనెల 16 నుంచి తరగతులు ప్రారంభించేం దుకు చర్యలు చేపట్టింది. ఐఐటీ, ఎన్‌ఐటీ, ట్రిపుల్‌ఐటీ, కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో కొనసాగే విద్యా సంస్థల్లో (జీఎఫ్‌టీఐ) జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ (జోసా) మొదటి, రెండో దశ సీట్లను కేటాయించింది.
ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ఐటీలు, జీఎఫ్‌టీఐల్లో మొత్తం 36,208 సీట్లతో పాటు సూపర్‌న్యూమరరీ కింద క్రియేట్ చేసిన 13 సీట్లు కలుపుకొని మొదటి దశ సీట్ల కేటాయింపును ప్రకటిం చింది. 107 సీట్లకు మినహా అన్నింటినీ విద్యార్థులకు కేటాయించింది. సీట్లు పొందిన వారిలో 29,415 మంది ఆయా విద్యాసంస్థల్లో చేరేం దు కు సీట్ యాక్సెప్టెన్స్‌కు ఒప్పుకొ న్నారు. మరో 6,799 సీట్లు మిగి లిపోగా రెండో దశ సీట్ల కేటా యింపును గురువారం ప్రకటిం చింది. ఇందులో ఎన్ని మిగులు తాయన్నది మరో నాలుగైదు రోజుల్లో తేలనుంది. సీట్లు పొం దిన విద్యార్థులకు ఐఐటీల్లో తరగతులను ప్రారంభించేందుకు షెడ్యూలును జారీ చేసింది.