సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : ఎచ్చెర్ల మండలం ఎస్‌ఎంపురంలో ఉన్న ట్రిపుల్ ఐటీ భవనాన్ని చూపిస్తూ టీడీపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు కిమిడి కళా వెంకటరావు సెల్ఫీ సవాల్ విసిరారు. కానీ ఆ భవనాన్ని టీడీపీ హయాంలో నిర్మించలేదు. దీంతో ఆయన అభాసుపాలయ్యారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో 21వ శతాబ్దపు గురుకులం కోసం రూ.18 కోట్లతో తొమ్మిది బ్లాక్‌ల భవనాన్ని నిర్మించారు. ని ర్మాణంలో ఉండగానే వైఎస్సార్ మరణంతో ఆయన తర్వాత ముఖ్యమంత్రిగా వచ్చిన కొణిజేటి రోశయ్య ప్రారంభించారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక ట్రిపుల్ ఐటీని ఇక్కడ ఏర్పాటు చేశారు. కొత్తగా భవనం నిర్మించకుండా వైఎస్సార్ నిర్మించిన భవనంలో ప్రారంభించారు.
ఇక ట్రిపుల్ ఐటీ తమ గొప్పతనంగా టీడీపీ చెప్పుకుంటోంది. ట్రిపుల్ ఐటీ అనగానే గుర్తుకొచ్చేది దివంగత ముఖ్యమంత్రి వైఎస్సారే. ఆయన కలల విద్యా సంస్థ ట్రిపుల్ ఐటీ. ఆయన హయాంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేశా రు. అందులో శ్రీకాకుళంలో కూడా ఏర్పాటు చేయా లని భావించారు. ఈ లోపు ఆయన మరణించడంతో ముందుకు సాగలేదు. టీడీపీ వచ్చాక ట్రిపుల్ ఐటీని వైఎస్సార్ నిర్మించిన భవనంలో ప్రారంభించింది. అది కూడా ఒక బ్యాచ్‌నే నడిపింది. దాంట్లో కూడా వైఎ స్సార్ నిర్మించిన భవనంలో 500మంది బాలికలతో, అద్దెకు తీసుకున్న మిత్రా ప్రైవేటు కళాశాలలో 500మంది బాలురుతో నడిపింది. వారి హయాంలో కొత్తగా ఒక్క భవనం కూడా నిర్మించలేదు. ఇవన్నీ మర్చిపోయి కళా ఇక్కడ సెల్ఫీ దిగడంతో ప్రజలే కాదు టీడీపీ నాయకులు, కార్యకర్తలు కూడా నవ్వుకుంటున్నారు.
అన్నీ బొంకులే
దాదాపు రూ.100 కోట్లతో టీడీపీ హయాంలో నిరుపేద విద్యార్థుల కోసం ఉన్నత విద్య అందించడమే లక్ష్యంగా ట్రిపుల్ ఐటీని తీసుకువచ్చామని కళా అవాస్తవాలను పోస్టు చేశారు. అయితే ఇక్కడే కళా పప్పు లో కాలేశారు. టీడీపీ హయాంలో కేవలం రూ.43 కోట్లు మాత్రమే మంజూరు చేశారు. వారి హయాంలో భవన నిర్మాణం చేపట్టలేకపోయారు. అరకొర నిర్మాణాలు చేపట్టి గాలికొదిలేశారు. దీంతో టీడీపీ పాలన సాగిన 2017లో కేవలం ఒక బ్యాచ్‌ను మాత్ర మే నడపగలిగారు. పీయూసీ 1 బ్యాచ్‌ను వెయ్యి మంది( 500బాలికలు, 500బాలురు)తో ప్రారంభించారు. తర్వాత సంవత్సరం చేరే బ్యాచ్‌కు భవనాల్లేక నూజివీడు ట్రిపుల్ ఐటీకి ఇక్కడి విద్యార్థులను పంపించారు. ట్రిపుల్ ఐటీలో పీయూసీ 1, పీయూసీ 2, ఇంజినీరింగ్ 1, ఇంజినీరింగ్ 2, ఇంజినీరింగ్ 3, ఇంజినీరింగ్ 4 తరగతులుంటాయి. టీడీపీ హయాంలో కేవలం పీయూసీ 1 బ్యాచ్‌ను ప్రారంభించి, ఆ తర్వా త భవనాలు సమకూర్చలేక చేతులేత్తేసి తర్వాత సంవత్సరం పీయూసీ 1లో చేరే విద్యార్థులను నూజివీడుకు తరలించారు.
కానీ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చాక అరకొరగా జరిగిన నిర్మాణాలను పూర్తి చేశారు. దాదాపు 4వేల మంది విద్యార్థులకు సరిపడా జీప్లస్ 5 భవనా న్ని రూ. 131కోట్లతో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం నిర్మించింది. దీంతో నాలుగు బ్యాచ్‌ల(పీయూసీ 1, పీయూసీ2, ఇంజినీరింగ్1, ఇంజినీరింగ్2)ను నడుపుతోంది. అంతటితో ఆగలేదు. 2024 నాటికి ఆరేళ్ల ఇంజినీరింగ్ కోర్సును విద్యార్థులు ఇక్కడే పూర్తి చేసే లా లక్ష్యం పెట్టుకుని రూ. 67కోట్లతో న్యూ అకాడమీ బ్లాక్‌ను ప్రస్తుతం నిర్మిస్తోంది. ఇది కాకుండా దాదా పు 6,600మందికి సరిపడా వసతి సౌకర్యాలను క ల్పించేందుకు రూ.133కోట్లతో నిర్మాణాలు చేపట్టేందుకు ఇటీవల బడ్జెట్‌లో నిధుల కేటాయింపు కూడా చేసింది.
అభాసుపాలు
వాస్తవాలన్నీ వదిలేసి ట్రిపుల్ ఐటీ ఏర్పాటు ఘనత మాదే అంటూ కళా ప్రభుత్వానికి సవాల్ విసిరారు. అయితే నిజం తెలిసిన ప్రజలు కళా సెల్ఫీ చూసి అవాక్కయ్యారు. జిల్లా టీడీపీ శ్రేణులు సైతం కళా వేషాలు చూసి నవ్వుకుంటున్నారు. అనవసర సెల్ఫీ చాలెంజ్‌లతో అభాసుపాలవుతున్నామని బాధ పడుతున్నారు. రిమ్స్, బీఆర్‌ఏయూ, వంశధార ప్రాజెక్టు, నాడు–నేడు స్కూళ్లు, ఆర్‌బీకేలు, ఉద్దానం మంచినీటి ప్రాజెక్టు, కిడ్నీ రీసెర్చ్ సెంటర్ వంటి పనులు ఏమైనా టీడీపీ చేపట్టి ఉంటే చెప్పుకోవాలి గానీ ఇలా తమవి కాని భవనాల వద్ద సెల్ఫీలు దిగి రాజకీయాలు చేయడం సరికాదని జనమంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment