AP Movie Ticket Rates: Producer Tammareddy Bharadwaj Comments Goes Viral - Sakshi
Sakshi News home page

Tammareddy Bharadwaj: ఏపీ ప్రభుత్వానికి ఆ హక్కు ఉంది

Published Thu, Jan 13 2022 8:17 AM | Last Updated on Thu, Jan 13 2022 9:21 AM

Producer Tammareddy Bharadwaj Interesting Comments On AP Movie Ticket Rates - Sakshi

Producer Tammareddy Bharadwaj Interesting Comments On Movie Ticket Rates: ‘‘సినిమా టికెట్‌ ధరలు పెంచుకోవ డానికి తెలంగాణ ప్రభుత్వానికి హక్కు ఉన్నట్లే.. టికెట్‌ ధరలు తగ్గించుకోవడానికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి హక్కు ఉంటుంది’’ అని దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు. బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో భరద్వాజ మాట్లాడుతూ.. ‘‘థియేటర్స్‌కు బీ ఫామ్‌ అనేది ఒకటి ఉంది. ఆ ప్రకారం రేట్లు ఉంటాయి. తప్పా.. ఒప్పా అనేది తర్వాతి విషయం. కానీ ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం ప్రభుత్వం చేస్తున్నది కరెక్ట్‌. అది చట్టపరంగా వారికి రాజ్యాంగం ద్వారా వచ్చిన హక్కు. అయితే థియేటర్స్‌వారికి కూడా రాజ్యాంగం ప్రకారం హక్కులు ఉంటాయి. కానీ చట్టపరంగా వాటిని తెచ్చుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి.

చదవండి: ‘నా థైస్‌లో కాదు.. మీ కళ్లలోనే ఉంది’ అంటూ అషు బోల్డ్‌ కామెంట్‌, పోస్ట్‌ వైరల్‌

లీగల్‌గా తెచ్చుకునే వరకూ హక్కు లేదు. ఈ విషయాన్ని వివాదం చేయడం కంటే పరిష్కరించుకోవడం మంచిది. ఎవరిపైనా ఆరోపణలు చేయడం కరెక్ట్‌ కాదు. ఏపీలో టికెట్‌ ధరల గురించి చాంబర్, ప్రొడ్యూసర్‌ కౌన్సిల్‌ నుంచి రిక్వెస్ట్‌ చేశాం. ఇటీవల మీటింగ్‌ జరిగిందని తెలిసింది. త్వరలో మరో మీటింగ్‌ జరిగి, ఈ సమస్యలు పరిష్కారమవుతాయనే నమ్మకం ఉంది. ఇక తమిళనాడు, కర్ణాటక, ముంబై వంటి రాష్ట్రాల్లో థియేటర్స్‌లో ఫిఫ్టీ పర్సెంట్‌ ఆక్యుపెన్సీ ఉండటం, మరికొన్ని రాష్ట్రాల్లో థియేటర్స్‌ క్లోజ్‌ చేసి ఉండటం, కరోనా థర్డ్‌ వేవ్‌ ముప్పు వంటి కారాణాల చేతనే ‘ఆర్‌ఆర్‌ఆర్‌’,‘రాధేశ్యామ్‌’ వాయిదా పడ్డాయి. ఈ విషయంలో ఏపీలోని టికెట్‌ ధరల ప్రభావం కేవలం ఒక శాతం మాత్రమే’’ అన్నారు.

చదవండి: స్పెషల్‌ సాంగ్‌తో పేరొస్తుందని చెప్పి బన్నీ ఒప్పించాడు: సమంత

ఇంకా మాట్లాడుతూ.. ‘‘ఫిలిం చాంబర్‌ మాట్లాడుతుందనే పెద్ద నిర్మాతలు కామ్‌గా ఉండి ఉండొచ్చు. అంతమాత్రాన వారి గురించి రకరకాలుగా మాట్లాడటం కరెక్ట్‌ కాదు. ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్, థియేటర్‌ ఓనర్స్‌.. ఇలా అన్ని సెక్టార్ల వారు చాంబర్‌ పరిధిలో ఉన్నారు. అయితే ‘మా’, ఫెడరేషన్‌ చాంబర్‌ పరిధిలోకి రావు. అవి ఇండిపెండెంట్‌ బాడీలు. అలాగే థియేటర్స్‌ టికెట్‌ ధరలతో మూవీ ఆరిస్ట్స్‌ అసోసియేషన్‌కి సంబంధం లేదు. అయితే చిరంజీవి, మోహన్‌బాబు, మహేశ్‌బాబు, పవన్‌కల్యాణ్‌ వంటి వారు నిర్మాతలుగా కూడా ఉన్నారు కాబట్టి టికెట్‌ ధరల గురించి మాట్లాడవచ్చు. కానీ ఆర్టిస్టులుగా వారికి ఆ అధికారం నాకు తెలిసి లేదు’’ అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement