‘‘జాతర’ సినిమా ట్రైలర్ ఆసక్తిగా ఉంది. మంచి కథ ఉంటే.. హీరో, దర్శకుల గురించి ప్రేక్షకులు పట్టించుకోరు. కొత్తగా వచ్చిన సతీష్ హీరో, రైటర్, డైరెక్టర్ అయ్యాడు. రిషబ్ శెట్టిలా తను కూడా పెద్ద హీరో, పెద్ద దర్శకుడు కావాలి. అలాగే ‘జాతర’ చిత్రం ఘనవిజయం సాధించాలి’’ అని దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు. సతీష్ బాబు రాటకొండ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన సినిమా ‘జాతర’. దీయా రాజ్ హీరోయిన్‌గా నటించారు.
గల్లా మంజునాథ్ సమర్పణలో రాధాకృష్ణా రెడ్డి, శివశంకర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 8న విడుదలవుతోంది. ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుకలో నటుడు శివ బాలాజీ మాట్లాడుతూ– ‘‘జాతర’ ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. ఈ మూవీ చాలా పెద్ద హిట్ అవ్వాలి’’ అన్నారు. ‘‘మంచి కథతో ఈ మూవీని చక్కగా తీశారాయన’’ అని శివ శంకర్ రెడ్డి చెప్పారు. ‘‘నటుడిగా, దర్శకుడిగా ఇది నా మొదటి సినిమా. మా చిత్రాన్ని ఆదరించాలి’’ అని సతీష్ బాబు రాటకొండ కోరారు.
Comments
Please login to add a commentAdd a comment