విజయ్ దేవరకొండ- పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన సినిమా 'లైగర్'. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా అనుకోని రీతిలో డిజాస్టర్‌గా మిగిలిపోయింది. రిలీజ్ అయిన తొలిరోజు నుంచి నెగిటివ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద చతికిలపడిందీ సినిమా. దీంతో నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు నష్టాలను మిగిల్చింది. ఈ క్రమంలో పూరి జగన్నాథ్, విజయ్ దేవరకొండపై కొందరు సినీ ప్రముఖులు విమర్శలు గుప్పిస్తున్నారు.
తాజాగా దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ లైగర్ రిజల్ట్‌పై షాకింగ్ కామెంట్స్ చేశారు. 'మన యాక్షన్‌ని బట్టే ప్రేక్షకుల రియాక్షన్‌ఉంటుంది. ఎగిరెగిరిపడితే ఇలాంటి అనుభవాలే ఎదురవుతాయి. సినిమాను చూడండి అని ప్రమోట్ చేసుకోవాలి. నువ్వు చిటికెలు వేస్తే రియాక్షన్ ఇలాగే ఉంటుంది. హీరోలు ఊరికే ఎగిరెగిరి పడటం మంచిది కాదు. అలాగే ఇష్టం వచ్చినట్లు ''ఊపేస్తాం.. తగలెడతాం.. అని స్టేట్‌మెంట్లు ఇస్తే ఇలాగే ప్రేక్షకులు మనల్ని తగలెడతారు' అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇక ఈ సినిమా డిజాస్టర్‌కు కారణాలు ఏమై ఉంటాయి అని ప్రశ్నించగా.. ఈ సినిమా గురించి ఎక్కువ మాట్లాడను. నేను పూరి జగన్నాథ్ అభిమానినే. కానీ లైగర్ ట్రైలర్ చూసినప్పుడే మూవీ చూడలనిపించలేదు. భవిష్యత్తులో కుదిరితే చూస్తా అని తమ్మారెడ్డి భరద్వాజ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment